అమెజాన్ ప్రైమ్ న‌వంబ‌ర్ 6న ఈ సినిమా విడుద‌ల” ద‌ర్శ‌కుడు కిర‌ణ్”

1221

అమెరికాలో ఉంటూ సినిమా మీద ప్యాష‌న్ తో 12 గంట‌లు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ మిగ‌తా 12 గంటలు స‌మయంలో దాద‌పుగా రెండేళ్లు క‌ష్ట‌ప‌డి ఆఫ్ బీట్ ఫిల్మ్స్, ఎస్. ఒరిజినల్స్ సంయుక్తంగా, మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో గ‌తం అనే సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు కిర‌ణ్. చ్చ‌టించా అమెజాన్ ప్రైమ్ వీడియోలో న‌వంబ‌ర్ 6న ఈ సినిమా విడుద‌ల అవుతున్న సంద‌ర్భంగా కిర‌ణ్ తెలుగు సినీ మీడియాతో మురు.

* గ‌తం ఎలా మొద‌లైంది

2018లో షూ

టింగ్ స్టార్ట్ చేశాం. 2019 అంతా చిత్రీకరణ జరిపాం. 2020 మార్చికి సినిమా అంతా రెడీ చేసి రిలీజ్ చేద్దాం అనుకునే టైమ్‌కి కరోనా రూపంలో బ్రేక్ పడింది. కరోనా వల్ల మా సినిమాకి పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమీ జరగలేదు. ఈ గ్యాప్‌లో చిన్న చిన్న మైనర్ వర్క్స్.. చేశామంతే. ఒకరకంగా మాకు కరోనా మంచే చేసిందని అనుకుంటున్నాం. ఎందుకంటే.. అమెజాన్ ద్వారా ఈ సినిమా దాదాపు 200కు పైగా దేశాలలో విడుదల అవుతుంది. మాములుగా థియేటర్స్‌లో విడుదల చేస్తే.. మాకు 150 థియేటర్స్ కూడా దొరికేవి కావేమో.

*ఈ సినిమా చిత్రీకరణ మొత్తం అమెరికాలోనే జరిగిందని అన్నారు. ఇటీవల వచ్చిన నిశ్శబ్దం కూడా అక్కడే చిత్రీకరణ జరిగింది. అమెరికాలోనే చిత్రీకరణ చేయడానికి కారణం ఏమైనా ఉందా?

-రెండు కారణాలు ఉన్నాయండి. నేనిక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయ్. అలాగే సినిమా అంటే ప్యాషన్. రెండూ ఎలా మ్యానేజ్ చేయడం అని.. ఆలోచిస్తే.. ఇక్కడే సినిమా చేస్తే.. ఎలా ఉంటుందని ఆలోచించి ఈ సినిమా మొత్తం అమెరికాలోనే చేశాం. అందుకే ఇప్పటి వరకు ఎవరూ చూపించని లొకేషన్లు, కెమెరా, లైటింగ్.. ఇలా ఏదైనా సరే.. ఒక భారీ ప్రొడక్షన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగాలని చాలా కష్టపడ్డాం. 10 గంటలు ఆఫీస్ వర్క్ చేసుకుంటూనే.. మిగతా టైమ్‌ని ఫ్యామిలీ కోసం, ఇటు సినిమా కోసం కేటాయించడం మాములు విషయం కాదు. చాలా త్యాగాలు చేస్తాం.. కనబడదు కానీ.. అది సినిమా రూపంలో తెలుస్తుంది. ఈ సినిమా సెట్‌లో కూడా 6 లేదా 7గురు మాత్రమే ఉండేవాళ్లం. 50, 100 మంది సెట్‌లో ఉండరు. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యం కలిగించేలా మా వర్క్, అవుట్‌పుట్ ఉంటుంది.

*లేక్ టాహో నేపథ్యంలో అని అంటున్నారు..? దాని గురించి చెబుతారా?

కాలిఫోర్నియాలో లేక్ టాహో అనే ఒక ఏరియా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ మంచు పడుతూ ఉంటుంది. మంచి చెరువు, ఆ చెరువు చుట్టూ కొండలు.. ఆ కొండల మీద మంచు. ఇంత అద్భుతమైన లోకేషన్ దొరకడం చాలా కష్టం. దీనిని మేము థ్రిల్లర్ కోసం వాడాం.

*ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు? మంచి మంచి షాట్స్ పడ్డాయ్. ట్రైలర్ కోసమేనా? సినిమా అంతా అటువంటి మ్యాజిక్ ఊహించవచ్చా?

సినిమా అంతా అటువంటి షాట్స్ ఉన్నా బోర్ కొడతాయ్. ఇది యాక్షన్ థ్రిల్లర్ కాదు. యాక్షన్ ఉంటుంది కానీ.. యాక్షన్ కోసమే ఈ సినిమా చేయలేదు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా తెరకెక్కించాం. ఇందులో కెమెరా వర్క్ అంతా హాలీవుడ్ స్థాయిలో ఉంటుంది. ట్రైలర్ నచ్చిందని చాలా మంది ఫోన్ చేసి చెప్పారు. సినిమా కూడా అంతకుమించి ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను.

*ఇటువంటి థ్రిల్లర్ సినిమాలు ఎంజాయ్ చేయాలంటే బిగ్ స్క్రీన్ చాలా బావుంటుంది. థియేటర్స్‌కి అనుమతులు వచ్చాయిగా? అటు వైపు ఆలోచించలేదా?

మేము ముందు థియేటర్స్‌లోనే అని ఆలోచించాం. కానీ ఈ ఆరు నెలల్లో జనాలు థియేటర్స్ గురించి మాట్లాడుకోవడం మానేసి.. ఓటీటీల గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే మాకు అర్థమైంది.. ఓటీటీ అని. నా పర్సనల్‌గా అంటే ఒక ఫిల్మ్ మేకర్‌గా నేను థియేటర్‌లో సినిమా చూడడానికే ఇష్టపడతాను. అయితే మేమున్న పరిస్థితుల్లో మాకు 150 థియేటర్లు దొరకడం కూడా కష్టమే. డబ్బులు వస్తాయనే విషయం కాదు కానీ.. మా సినిమా ప్రపంచం మొత్తం చూడాలనే ఈ సినిమా తీశాం. ఇలా చూస్తే.. ఇంతకంటే పెద్ద ఫ్లాట్‌ఫామ్ దొరకదు.

*మీ ‘గతం’ సినిమా గురించి ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు?

థ్రిల్లర్స్ అంటే ఇష్టపడేవారికి ఈ చిత్రం బాగా నచ్చుతుంది. వేరే భాషలలో ఉన్న సినిమాలను కూడా సబ్ టైటిల్స్ ఉంటే చాలు చూసేస్తున్నాం. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలోని సినిమాలు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నాయి. ఓటీటీ వంటి ప్లాట్‌ఫామ్స్ ఉండటంతో అనేక జోనర్ల సినిమాలను చూస్తున్నాం. ఇటువంటి థ్రిల్లర్స్ మీద ప్రేక్షకులు బాగా ఇంట్రస్ట్ పెడతున్నారు. థ్రిల్లర్ జోనర్ సినిమాల గురించి చెప్పాలంటే ఎగ్జిక్యూషన్ అనేది చాలా కష్టం. చివరి వరకు సస్పెన్స్‌ని క్యారీ చేయలేకపోతే బోర్ కొట్టేస్తుంది. అటువంటి సస్పెన్స్ క్రియేట్ చేయలేకపోతే థ్రిల్లర్ సినిమాలు తీయడం కూడా వేస్ట్. ఇంటర్వెల్‌కే ట్విస్ట్ తెలిసిపోతే ప్రేక్షకులు ఇంక సినిమా చూడాల్సిన అవసరం లేదు. సో.. ఇటువంటి వన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రం చేయడం జరిగింది. ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సినిమా చూసి థ్రిల్ ఫీలవుతారు. అది మాత్రం హండ్రెడ్ పర్సంట్ చెప్పగలను.