సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘మెడ్రన్ లవ్’ ఇండియన్ వర్షన్ ప్రకటించిన అమెజాన్ ప్రైమ్ వీడియో..

588


అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఇండియాలో ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ఈ ఓటిటి సంస్థ. తాజాగా ఈ ప్రతిష్టాత్మక సంస్థ నుంచి మరో సూపర్ హిట్ వెబ్ సిరీస్ రాబోతుంది. అదే ‘మోడ్రన్ లవ్’. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెండు సీజన్స్ వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇండియాలో కూడా దీన్ని విడుదల చేస్తున్నారు. ప్రముఖ భాషలన్నింటిలోనూ ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. మోడ్రన్ లవ్ చెన్నై.. మోడ్రన్ లవ్ ముంబై.. మోడ్రన్ లవ్ హైదరాబాద్ పేరుతో.. ప్రాంతీయ భాషల్లోకి ఈ సిరీస్‌ను అనువదిస్తున్నారు. కచ్చితంగా మోడ్రన్ లవ్ ఇండియాలో కూడా ఘన విజయం సాధిస్తుందని మేకర్స్. మోడ్రన్ లవ్ అనేది భిన్నమైన రూపాలలో ఉన్న ప్రేమకు ఒక భావగీతం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ షోలో ఉన్న పాత్రలతో రియల్ లైఫ్‌లో తమను తాము చూసుకున్నామని తెలిపారు. అలాగే భారతదేశపు భిన్నమైన సంస్కృతికి కూడా ఈ సిరీస్ అతికినట్లు సరిపోతుంది. కచ్చితంగా ఇక్కడ కూడా మీ ప్రేమాభిమానాలు మాకు లభిస్తాయని షో నిర్వాహకులు తెలిపారు.