50 రోజులు పూర్తి చేసుకున్న పుష్ప.. 365 కోట్లు.. బాక్సాఫీస్ దగ్గర తగ్గేదే లే..

408

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్స్ అదిరిపోయాయి. ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. కొత్త ఏడాది కూడా అదే జోరు చూపించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన తర్వాత ఈ సినిమాకు ప్రశంసల వర్షం కురుస్తోంది. జాతీయ అంతర్జాతీయ క్రికెటర్లు ఈ సినిమాకు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసి పెడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక వసూళ్లు తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప.
తాజాగా ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 365 కోట్లు వసూలు చేసింది పుష్ప. ఆయన పర్ఫార్మెన్స్‌కు అంతా ఫిదా అయిపోయారు. హిందీలో 100 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా. పుష్ప సినిమాను కేవలం అల్లు అర్జున్ కోసమే చూడొచ్చు అనేలా థియేటర్స్‌కు క్యూ కట్టారు ఆడియన్స్. అల్లు అర్జున్ ఐకానిక్ ఇమేజ్‌కు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ కీలక పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పుష్ప సినిమాను నిర్మించారు.