మిస్టరీ సినిమా లో “ఆలీ” పోస్టర్ లుక్ విడుదల

142

పి వి ఆర్ట్స్ పతాకంపై తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి హీరో హీరోయిన్ గా అలీ, సుమన్, తనికెళ్ళ భరణి ముఖ్య తారాగణం తో తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “మిస్టరీ”. వెంకట్ పులగం నిర్మాత.

ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అలీ గారు చాలా కీలకమైన ఫారెన్సిక్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు. ఈరోజు ఆయన పోస్టర్ ను విడుదల చేస్తున్నాము. ఈ సందర్భంగా

నిర్మాత వెంకట్ పులగం మాట్లాడుతూ “దర్శకుడు సాయికృష్ణ గారు నాకు కథ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది, వెంటనే సినిమా చేద్దాం అని నిర్ణయించుకున్నాను. సీనియర్ నటులు సుమన్ గారు, ఆలీ గారు, తనికెళ్ళ భరణి గారు మా చిత్రం లో ముఖ్యమైన పత్రాలు చేస్తున్నారు. ఈ రోజు ఆలీ గారి పోస్టర్ లుక్ విడుదల చేసాం.
సినిమా చాలా బాగా వస్తుంది” అని తెలిపారు.

హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ “ఆలీ” గారి పోస్టర్ లుక్ విడుదల చేసాం, ఫారెన్సిక్ ఆఫీసర్ సాయి పాత్రలో ఆలీ గారు కనిపిస్తారు, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. మిస్టరీ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ చిత్రం” అని తెలిపారు

సినిమా పేరు – మిస్టరీ

హీరో – తల్లాడ సాయికృష్ణ, హీరోయిన్ – స్వప్న చౌదరి

నటి నటులు – అలీ, సుమన్, తనికెళ్ళ భరణి, వెంకట్ రామ్ రెడ్డి, రవి రెడ్డి, స్వప్న చౌదరి, సత్య శ్రీ, గడ్డం నవీన్ , ఆకెళ్ల గోపాల కృష్ణ.

బ్యానర్ – పి.వి.ఆర్ట్స్

ప్రొడ్యూసర్ – వెంకట్ పులగం

డైరెక్టర్ – తల్లాడ సాయికృష్ణ

కథ మాటలు – శివ కాకు

సంగీతం – రామ్ తవ్వ,

లిరిక్స్ – శ్రీనివాస్ సూర్య

కెమెరా – సుధాకర్ బాట్లే