బాలనటుడిగా కెరీర్ ని ప్రారంభించి నలభై అయిదు సంవత్సరాల పాటు సినీ రంగం లో అగ్ర హాస్య నటుడు గా కొనసాగుతున్న అలీ కారణ జన్ముడని సీనియర్ కథానాయిక శ్రీమతి రాజశ్రీ అన్నారు. హైదరాబాద్ లోని సత్య సాయి నిగమాగమం లో సంగమం ఫౌండేషన్ మరియు వివేకానంద హాస్పిటల్స్ వారు కన్నుల పండుగగా నిర్వహించిన ‘ కామెడీ ఫెస్టివల్’ లో హాస్య నటుడు అలీ ని ‘సంగమం- వివేకానంద లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు ‘ తో సత్కరించారు . అవార్డు కింద వెండి కిరీటం, వెండి కంకణం ను బహుకరించారు . కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన అలనాటి ప్రముఖ కథానాయిక శ్రీమతి రాజశ్రీ గారు మాట్లాడుతూ అలీ ఎంత మంచి నటుడో అంత మంచి వ్యక్తి కూడా. అతని లో ఉన్న సేవా గుణం అందరికి స్ఫూర్తినిస్తుంది . అయిదవ ఏట నుంచి నేటి వరకు అలుపెరగకుండా కళా జీవితాన్ని గడుపుతున్న అలీ జన్మ నిజంగా ధన్యమైంది . అతనికి ‘పద్మశ్రీ’ అవార్డు వస్తే చూడాలని వుంది ‘ అన్నారు.కార్యక్రమానికి అతిధులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు , వివేకానంద హాస్పిటల్స్ అధినేత డా . గీత, ప్రముఖ నటులు శ్రీ తనికెళ్ళ భరణి, శ్రీమతి శ్రీలక్ష్మి గార్లు అలీ ని అభినందించారు. ఈ సందర్భంగా అలనాటి హీరో కాంతారావు గారి కుమారుడు రాజా , హాస్య నటి పాకీజాహ్ , కళాకారిణి హేమకుమారి గార్లకు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ వె. రాజశేఖర్ గారు ఒకొక్కరికి పాతిక వేలు చొప్పున ఆర్ధిక సాయాన్ని అందించారు . ‘సంగమం’ సంజయ్ కిషోర్ నిర్వహణ లో జరిగిన ఈ కార్యక్రమం లో హాస్య నటులు జయలలిత, పాకీజాహ్, రాగిణి, శివారెడ్డి, సునామి సుధాకర్ , బులెట్ భాస్కర్, నాటి నరేష్, హరిబాబు, పేరడీ గురుస్వామి, సంకర నారాయణ లు ప్రదర్శించిన హాస్యవల్లరి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది
అలీ కి ‘ పద్మశ్రీ ‘రావాలి – అలనాటి ప్రముఖ కధానాయిక రాజశ్రీ
Previous article
Next article
RELATED ARTICLES