HomeTeluguఅక్కినేని పురస్కారాల ప్రదానం

అక్కినేని పురస్కారాల ప్రదానం

అక్కినేని చలన చిత్ర జీవితం వ్యకిత్వం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకం అని సీనియర్ జర్నలిస్ట్ దర్సక రచయితా ప్రభు కొనియాడారు .శుక్రవారం సాయంత్రం దివంగత ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ముగింపు ఉత్సవం సందర్భంగ EVV యువ కళావాహిని అద్వర్యం లో అమరావతి రోడ్ లోని సురేష్ మూవీస్ ఫిలిం కార్యాలయం లో జరిగిన అక్కినేని పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమమం లో ఆయన పాల్గొని ప్రసంగించారు . ఈ కార్య క్రమానికి EVV కళావాహిని అధ్యక్షులు వెచ్చ కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు ప్రభు తన ప్రసంగాన్ని కోన సాగిస్తూ అక్కినేని తో సుదీర్ఘ అనుబంధం తన అదృష్టం అని చెప్పారు.అక్కినేని ని దర్శకత్వం చేసే అవకాశం రావటం అయన పై గ్రంధం రచించడం తన జీవితం లో మధుర అనుభూతాలని అని అన్నారు . సురేష్ మూవీస్ జిల్లా మేనేజర్ మాదాల రత్తయ్య చౌదరి మాట్లాడుతూ సాటిలేని సినీ దిగ్గజం అక్క్కినేని అని కొనియాడారు .
అనంతరం వెచ్చ కృష్ణ మూర్తి అద్వర్యం లో అక్కినేని తో ఎంతో అనుబంధం కల సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ , దర్సకుడు , రచయత ప్రభు కి సినీ పాత్రికేయ సామ్రాట్ బిరుదు ని ప్రదానం చేసారు. మాదాల రత్తయ్య చౌదరి కి అక్కినేని పురస్కారం ని అందజేశారు . ఈ కార్యక్రమం లో అక్కినేని ఫాన్స్ లండన్ ప్రసాద్, మని  పి కిరణ్ , రమణ ,గుప్త తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES