HomeTeluguఘనంగా "చోర్ బజార్" ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా “చోర్ బజార్” ప్రీ రిలీజ్ వేడుక

ఆకాష్ పురి హీరోగా నటించిన సినిమా చోర్ బజార్. గెహనా సిప్పీ నాయికగా నటించింది. దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్, నిర్మాత బండ్ల గణేష్, హీరో సాయిరామ్ శంకర్, పూరీ జగన్నాథ్ భార్య లావణ్య, దర్శకుడు పరశురామ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ…జీవన్ దర్శకుడిగా సినిమా బాగా చేస్తావని నీ మీద నమ్మకం ఉంది. మా అబ్బాయితో మంచి సినిమా చేయ్ అని చెప్పి ఆకాష్ ను నాతో పంపించారు పూరి జగన్నాథ్. ఆయన మాట నిలబెట్టుకుంటానని పూర్తి నమ్మకం ఉంది. ఆకాష్ ఈ కథకు పర్పెక్ట్ యాక్టర్. బచ్చన్ సాబ్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాడు. గెహనా సిప్పీ మంచి హీరోయిన్ అవుతుంది. అర్చన మేడమ్ రూపంలో నాకు అక్క దొరికింది. నా నెక్ట్ సినిమాలోనూ ఆమె డేట్స్ ఇవ్వాలి. చోర్ బజార్ ను కలర్ ఫుల్ ఫిల్మ్ గా మార్చింది మా టీమ్ మెంబర్సే. ఆర్ట్ వర్క్ నుంచి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ వరకు అంతా కష్టపడి మంచి సినిమా చేశారు. అన్నారు.

రచయిత బీవీఎస్ రవి మాట్లాడుతూ…హీరో కావాలంటే సిక్స్ ప్యాక్, హెయిర్ స్టైల్, హైట్ అడుగుతారు కానీ నటించడం వచ్చా అని తెలుసుకోరు. ఆకాష్ కు నటన తెలుసు. స్టార్ డమ్ ఇవాళ కాకున్నా రేపైనా వస్తుంది. కానీ నటుడిగా ఆకాష్ ఎప్పుడో సక్సెస్ అయ్యాడు. పూరీ జగన్నాథ్ కొడుకు అవడం వల్ల అతని స్టైల్ మీద వాళ్ల నాన్న పూరి ప్రభావం పడింది. ఈ సినిమాతో దాన్నుంచి కూడా ఆకాష్ బయటకొస్తాడు. అన్నారు.

బండ్ల గణేష్ మాట్లాడుతూ…ఆకాష్ పూరి స్టార్ అవడానికే పుట్టాడు. అతనిలో ఆ టాలెంట్ ఉంది. ఆకాష్ స్టార్ కాకుండా ఎవరూ ఆపలేరు. మా గబ్బర్ సింగ్ సినిమాలో చిన్నప్పటి పవన్ కళ్యాణ్ గా నటించినప్పుడే ఆకాష్ పెద్ద హీరో అవుతాడని ఫిక్స్ అయ్యా. దర్శకుడు జీవన్ రెడ్డి మంచి ప్రతిభావంతుడు, మేధావి, అతనితో ఎక్కువ సేపు మాట్లాడితే నాకు భయమేస్తుంది. ఆయన లాస్ట్ సినిమా చాలా బాగుంది. ఆకాష్ కు నా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు స్టార్ అయ్యాక మీ నాన్నకు డేట్స్ ఇవ్వొద్దు. మీ నాన్న నీతో సినిమా చేసేందుకు క్యూలో నిల్చోవాలి అంత పెద్ద హీరో కావాలి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావాలి అని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ…చోర్ బజార్ సినిమా చూస్తే నా ఫలక్ నుమా దాస్ సినిమా గుర్తొస్తోంది. ఆకాష్ ఈ సినిమాతో హిట్ కొడతాడని కన్ఫర్మ్ గా చెప్పగలను. చోర్ బజార్ కు నేనూ చాలాసార్లు వెళ్లాను. ఎక్కడా దొరకని వస్తువులన్నీ అక్కడ ఉంటాయి. ఈ కథతో సినిమా చేయాలన్న ఆలోచన రావడమే గ్రేట్. జీవన్ రెడ్డి సినిమాల్లో రీసౌండ్ ఎక్కువ ఉంటుంది. అందుకే థియేటర్ కు వెళ్లి ఈ సినిమా చూడండి. నాకు రిలీజ్ ముందే సినిమాను చూడాలన్నంత ఆసక్తిగా అనిపిస్తోంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు.

హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ…చోర్ బజార్ సినిమా ఇంత బాగా రావడానికి మా టీమ్ కారణం. సురేష్ బొబ్బిలి చేసిన పాటలకు వేల రీల్స్ చేస్తున్నారు. జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫీతో మ్యాజిక్ చేశారు. నిర్మాతలు లాక్ డౌన్ లో సినిమా ఆగిపోయినా, బడ్జెట్ పెరిగినా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. గెహనా సిప్పీకి కెరీర్ లో ఎదగాలని ఎంతో తపన ఉంది. ఈ సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి క్రియేట్ చేసిన మ్యాజిక్ అనుకోవచ్చు. ఇలా టీమ్ అంతా పడిన శ్రమే ఈ సినిమా. హీరోగా నాకు మంచి పేరొస్తుందని నమ్ముతున్నా. ఈ కార్యక్రమానికి వచ్చిన విశ్వక్, మా బాబాయ్ సాయిరామ్, బండ్ల గణేష్ కు థాంక్స్. ఇతనికేంటి పూరి జగన్నాథ్ కొడుకు అనుకుంటారు. కానీ నేను మా నాన్న స్టార్ డైరెక్టర్ కాక ముందే హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యా. మా నాన్న అన్నీ ఇచ్చారు. ఆయన నా పక్కన లేకుంటే నేను జీరో ఆ విషయం నాకు తెలుసు. అందుకే సొంతగా నాకంటూ ఓ పేరు గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నా. రేపు మా అమ్మకు, చెల్లికి ఒక కొడుకుగా అన్నయ్యగా ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నా. స్టార్ కిడ్స్ అంటే రాగానే స్టార్స్ అయిపోరు, వాళ్లలో టాలెంట్ ఉంటేనే అవుతారు. నా గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటూ నన్ను నేను మెరుగుపర్చుకుంటున్నా. ఏదో ఒకరోజు మా నాన్న స్థాయికి వెళ్లి, ఆయనతో కలిసి సినిమా చేస్తా. మాతో పాటు రిలీజ్ అవుతున్న సమ్మతమే, ఇతర సినిమాలూ విజయం సాధించాలి. అన్నారు.

నటి అర్చన మాట్లాడుతూ…ఆకాష్ నాకు హీరోగా పరిచయం అయ్యాడు. నాకిప్పుడు కొడుకు అయ్యాడు. ఆకాష్ లో హీరోకు కావాల్సిన హీరోయిజం ఉంది. ఆకాష్ ది మంచి క్యారెక్టర్. అతని డిసిప్లిన్ ఉంది. అతనితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. త్వరలో ఆకాష్ తండ్రి పూరీ జగన్నాథ్ అని చెప్పుకునే స్థాయికి వెళ్తాడు. అన్నారు.

బిగ్ టికెట్ రిలీజ్ చేసిన అనంతరం దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ… ఆకాష్ కు సక్సెస్ బాకీ పడిపోయింది. వడ్డీతో సహా అది దక్కుతుంది. జీవన్ రెడ్డి సహాయ దర్శకుడిగా ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆయన కమిట్ మెంట్ ఉన్న దర్శకుడు. జార్జ్ రెడ్డి తో సూపర్బ్ సినిమా చేశాడు. దర్శకుడికి పెద్ద హిట్ రావాలి. ఆకాష్ ఈ సినిమాతో కమర్షియల్ సినిమాగా నిలబడాలి. అన్నారు.

నిర్మాత వీఎస్ రాజు మాట్లాడుతూ… చోర్ బజార్ అనేది కలర్ ఫుల్ కమర్షియల్ ఫిల్మ్. ఫుల్ ఫిల్మ్ ఎంజాయ్ చేస్తారు. సినిమా సక్సెస్ మీద కాన్ఫెడెన్స్ తో ఉన్నాం. జీవన్ ఇలాంటి సినిమాలు చేయాలని కోరుకునేవాడిని. చోర్ బజార్ రాత్రి జరిగే కథ 35 రోజుల వరకు కేవలం రాత్రి షూటింగ్ చేశాం. యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. పృథ్వీ అనే స్టంట్ మాస్టర్ ఫైట్స్ బాగా డిజైన్ చేశాడు. ఈ సినిమాతో ఆకాష్ కు హిట్ గ్యారెంటీ. అన్నారు.

నటుడు సుబ్బరాజు మాట్లాడుతూ…జీవన్ రెడ్డి ఆకాష్ తో విప్లవ సినిమా చేస్తాడనుకున్నా కానీ ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ రూపొందించాడు. నేను కూడా ఈ చిత్రంలో నటించాడు. బ్యూటిఫుల్ గా మూవీ వచ్చింది. చిత్రబృందం అందరికీ కంగ్రాట్స్, బెస్ట్ విశెస్ చెబుతున్నా. అన్నారు.

హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ…రొమాంటిక్ సినిమా క్లైమాక్స్ బాగా నచ్చింది. అప్పుడు ఆకాష్ కు పోన్ చేసి ఇంత బాగా నటించడం ఎప్పుడు నేర్చుకున్నావురా. మెహబూబా కంటే రొమాంటిక్ లో మెచ్యూర్డ్ గా నటించాడు. చోర్ బజార్ కమర్షియల్ లోడెడ్ ఫిల్మ్. ఆకాష్ కు ఈ సినిమాతో విజయం దక్కాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నాకు అందరూ తెలిసిన వాళ్లే ఉన్నారు. నిర్మాత సుబ్రహ్మణ్యం కూడా బెస్ట్ ఫ్రెండ్. జీవన్ కు దర్శకుడిగా సక్సెస్ ఫుల్ ఫిల్మ్ అవుతుంది. అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరో సందీప్ మాధవ్, దర్శకుడు అజయ్ భూపతి, సుబ్బరాజు, రచయిత బీవీఎస్ రవి, సంగీత దర్శకులు రామ్ మిర్యాల, గీత రచయిత మిట్టపల్లి సురేందర్, కాసర్ల శ్యామ్ తదితరులుపాల్గొన్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES