HomeTeluguఆద‌ర్శ్‌, చిత్ర శుక్లా హీరో హ‌రోయిన్లు గా చేత‌న్‌ రాజ్ ఫిలింస్ చిత్రం ప్రారంభం

ఆద‌ర్శ్‌, చిత్ర శుక్లా హీరో హ‌రోయిన్లు గా చేత‌న్‌ రాజ్ ఫిలింస్ చిత్రం ప్రారంభం

ఆద‌ర్శ్‌, చిత్ర శుక్లా హీరో హ‌రోయిన్లు గా న‌టిస్తున్న నూత‌న చిత్రం బుధ‌వారం నాడు రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైంది. చేత‌న్‌ రాజ్ ఫిలింస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1 గా చేత‌న్ మైసూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ‌మౌళి సినిమాల‌కు ఎడిట‌ర్‌ గా ప‌నిచేసిన ఆంథోనీ ఎం.ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. హీరోహీరోయిన్ల‌ పై చిత్రించిన ముహూర్త‌పు స‌న్నవేశానికి ర‌మేష్ ప్ర‌సాద్ క్లాప్ కొట్టారు.

అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో చిత్ర ద‌ర్శ‌కుడు ఆంథోనీ ఎం. మాట్లాడుతూ, క్రైమ్ అండ్ స‌స్పెన్స్‌ తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా రూపొందిస్తున్నాం. ఇది నాకు ద‌ర్శ‌కుడిగా తొలి సినిమా. ఇంత‌కుముందు రాజ‌మౌళి సినిమాల‌కు ఎడిట‌ర్‌ గా ప‌ని చేశాను. య‌దార్థ సంఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కిస్తున్నాం. హీరో హీరోయిన్ల‌ కు, ఇత‌ర న‌టీన‌టుల‌కు వారి వారి పాత్ర‌ల గురించే చెప్పాను. వెంట‌నే వారు చేయ‌డానికి అంగీక‌రించారు. చేత‌న్‌ రాజ్ ఫిలింస్ ద్వారా ప‌రిచ‌యం కావ‌డం ఆనందంగా వుంద‌ని తెలిపారు.

చిత్ర నిర్మాత చేత‌న్ మైసూర్య తెలుపుతూ, మా బ్యానర్ లో మొద‌టి సినిమాగా నిర్మిస్తున్నాం. క‌థ చాలా థ్రిల్లింగ్ గా వుంది. మంచి సినిమా తీస్తున్నామ‌ని అన్నారు.

హీరో ఆద‌ర్శ్ మాట్లాడుతూ, నా పాత్ర గురించి ద‌ర్శ‌కుడు చెప్ప‌గానే చాలా ఎక్సైట్ అయ్యాను. అన్నీ ఎమోష‌న్స్ వున్నాయి. నేను ఏ విధం గా హీరో గా ప‌రిచ‌యం కావాల‌నుకున్నానో అది ఇందులో వుంది. కామెడీ కూడా వుంది. సీనియ‌ర్ల మ‌ధ్య న‌టించ‌డం చాలా ఆనందంగా వుంది అన్నారు.

హీరోయిన్ చిత్ర శుక్లా మాట్లాడుతూ, ఇందులో నా పాత్ర బాగా డిజైన్ చేశారు. న‌టిగా పెర్‌ఫార్మెన్స్‌ కు అవ‌కాశం వున్న పాత్ర ద‌క్కింది. ప్ర‌తి సినిమాను మొద‌టి సినిమా లాగా చేస్తుంటాను, అలా నేను ఈ సినిమాను ఫ‌స్ట్ సినిమా గా భావించి చేస్తున్నాను. మంచి పేరు వ‌స్తుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని తెలిపారు.

న‌టుడు భ‌ర‌ణి మాట్లాడుతూ, ఆంథోనీ ఎడిట‌ర్‌ గా మంచి పేరుతెచ్చుకున్నాడు. రాజ‌మౌళి సినిమాల‌కు ప‌నిచేశాడు. అప్పుడు ప‌రిచ‌యం అయిన ఆయ‌నలో ద‌ర్శ‌కుడు అవ్వాల‌నే త‌ప‌న గ్ర‌హించాను. ద‌ర్శ‌కుడు నాపై న‌మ్మ‌కంతో మంచి పాత్ర ఇచ్చారు. ఆద‌ర్శ్‌ తో క‌లిసి న‌టించ‌డం చాలా హ్యాపీగా వుంది అన్నారు.

న‌టుడు శ్రీ‌కాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ, కిల్లింగ్ వీర‌ప్ప‌న్ చేసిన‌ప్పుడు ఆంథోనీతో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ఈ సినిమావ‌ర‌కు వ‌చ్చింది. నా పాత్ర చాలా బాగుంది. అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని తెలిపారు.

ఫైట్ మాస్ట‌ర్ పృథ్వి తెలుపుతూ, ఇంట‌ర్‌వెల్ ట్విస్ట్ చాలా క్రేజీగా ద‌ర్శ‌కుడు రాసుకున్నారు. ఈ ఫైట్‌ పై నెల‌రోజులు ఫోక‌స్ పెట్టారు. అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌న్నారు.

న‌టీన‌టులుః

ఆద‌ర్శ్‌, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి (క‌న్న‌డ హీరో), శ్రీ‌కాంత్ అయ్యంగార్, భ‌ర‌ణి, జ‌య‌శ్రీ‌, సుద‌ర్శ‌న్‌, సంజ‌య్ రెడ్డి.

సాంకేతిక విభాగం:

క‌థ‌, నిర్మాత‌- చేత‌న్ మైసూర్య‌,

స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఆంథోఋని ఎం.

కెమెరాః వెంక‌ట హ‌నుమ నారిశెట్టి,

సంగీతం: గోపీ సుంద‌ర్‌,

ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌- ఎస్‌.వి. రామ‌కృష్ణ‌,

ఫైట్స్‌- పృధ్వీ,

ఎడిటర్‌- కిశోర్ కుమార్ ఎం.,

డైలాగ్స్‌- ద‌త్తు, శ‌శి, పాట‌లుః రెహ‌మాన్‌, కళ‌- కె. రాకేష్‌,కాస్ట్యూమ్ డిజైన్‌- అంజ‌లి. ఎం., పి.ఆర్‌.ఓ.- వంశీ శేఖ‌ర్‌.

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES