తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ తమ యొక్క మరో ప్రతిష్టాత్మకమైన షాపింగ్ మాల్‌ను నేడు మన బాలాపూర్‌లో మహా నటి కీర్తి సురేష్ మరియు గౌరవనీయులైన రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గార్ల చేతుల మీదుగా అంగరంగవైభవంగా ప్రారంభోత్సవం జరుపుకున్నది. ఇక నుండి బాలాపూర్ మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాల వారు ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌లో గంటల తరబడి ప్రయాణాలు చేసి సిటీకి వెళ్లి షాపింగ్ చేయవలసిన అవసరం లేకుండా 5 అంతస్థులు, 25,000 చదరపు అడుగులలో కుటుంబమంతటకీ షాపింగ్ ఒకోచోట చేసుకునే విధంగా పట్టు, ఫ్యాన్సీ, హై–ఫ్యాన్సీ, చుడీదార్స్, వెస్ట్రన్‌వేర్, బెడ్ షీట్స్, మెన్స్ బ్రాండెడ్, కిడ్స్ వేర్, ఎథినిక్ వేర్‌లతో సహా ఒక్కో విభానికి ఒక్కో అంతస్థు కేటాయిస్తూ ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని ఇస్తూ.. మార్కెట్ ధరల కన్నా తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నామని ఈ షాపింగ్ మాల్ ద్వారా మరో 300 మందికి ఉపాధి కల్పిస్తున్నామని సంస్థ అధినేత శ్రీ అల్లక సత్యనారాయణ గారు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ వేడుకను ఇంతటి ఘన విజయం చేకూర్చినందుకు కస్టమర్లకు మరియు పోలీస్ శాఖ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.