సినీ తార అను ఇమ్మాన్యుయ‌ల్ చేతుల మీదుగా తుర్కమంజిల్ లో ప్యాట్నీ సెంట‌ర్ చంద‌న బ్ర‌ద‌ర్స్ మ‌రో షాపింగ్ మాల్ లాంచ్ !!

125

తెలంగాణ ప్రజలకు ఎంతో సుపరిచితమైన ప్యాట్నీసెంటర్ చందన బ్రదర్స్ వారి మరో షాపింగ్ మాల్ శుక్ర‌వారం తుర్కమంజిల్ లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరియు ప్రముఖ సినీతార అను ఇమాన్యుయల్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభ‌మైంది. ఆ చుట్టుప్రక్కల ఇదే అతి పెద్ద షాపింగ్ మాల్ కావడం విశేషం. ఇక్క‌డ తుర్కమంజిల్ లో అన్ని హంగులతో 4 అంతస్థులలో 15,000 చ॥ అడుగులలో సువిశాలమైన సకుటుంబ వస్త్ర ప్రపంచం అత్యాధునికంగా అంత‌ర్జాతీయ షాపింగ్ అనుభూతి మీకు అందిస్తూ…కుటుంబమంతటకీ కావలసిన వస్త్రాలు హోల్సేల్ ధరలకే విక్రయిస్తున్నామనీ… అలాగే సుమారు 200 మందికి ఉపాధి కలిపిస్తున్నామనీ..సంస్థ అధినేత శ్రీ అల్లక సత్యనారాయణ గారు తెలిపారు. ఇంతగా మమ్మలని ఆదరిస్తూ, ప్రోత్సహిస్తున్న తెలంగాణా ప్రజలకు |హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.