మనసును తాకే “అతడు-ఆమె-ప్రియుడు”

390

చాలా కాలం తరువాత సుప్రసిద్ధ నవలా రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ మెగాఫోన్ పట్టారు. ఆయనే కథ.. కథనాలను రూపొందించి “అతడు-ఆమె-ప్రియుడు”ని వెండితెరపై ఆవిష్కరించారు. ఈ చిత్రానికి పదునైన… చాలా లోతైన సంభాషణలు కూడా ఆయనే రాశారు. ఇందులో సీనియర్ నటుడు బెనర్జీ, సునీల్, కౌశల్, మహేశ్వరి, దియా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో… రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విభిన్న కథాచిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏమాత్రం అలరించిందో చుద్దాం పదండి.

కథ: రవి(బెనర్జీ) అనే అస్ట్రో నాట్ సయింటిస్ట్. అతడు తోక చుక్క నుంచి ఊడి పడే ఉల్క వల్ల ఉద్భవించే రేడియేషన్ వల్ల భూమి మీద ఉండే జీవరాసులన్నీ చనిపోతాయని… అందుకే తన ఇంటిని యాంటీ రేడియేషన్ తో కవర్ చేసినట్టు తన వద్దకు వచ్చిన భీమ రాజు(కౌశల్), ప్రవరాఖ్యుని(సునీల్)తో చెబుతాడు. సో భూమి మీద ఉండే జీవరాసులన్నీ చనిపోతే… తాము ముగ్గురే ఉండి ఏమి చేస్తామని చెప్పి… మనవులంతా అంతరించి పోతే…. కొత్తగా సంతానాన్ని వృద్ది చేయడానికి ఓ మహిళను కూడా ఆ ఇంట్లోకి తీసుకుని రా అని ఓ కండీషన్ మీద ప్రవరాఖ్యునికి చెబుతాడు రవి. అనుకున్నట్టే ఓ అందమైన అంమ్మాయిని తీసుకొని వస్తాడు. మరి భూమి ఆ ఉల్క రేడియేషన్ కి గురై జీవ జాతి అంతరించిందా? సయింటిస్ట్ రవి ఎందుకు అలా చెప్పాడు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథనం విశ్లేషణ: స్వచ్ఛమైన ప్రేమలో వుండే గొప్పతనాన్ని… స్త్రీ ఔన్నత్యాన్ని నేటి యువతకు ఓ మెసేజ్ ఇచ్చేందుకు “అతడు-ఆమె-ప్రియుడు”కి రాసుకున్న కథ, కథనం ఇంస్పైరింగ్ గా వుంది. కేవలం డబ్బు, వ్యామోహంతోనే ప్రేమ పేరుతో వంచనకు గురయ్యే చాలా మంది యువతీయువకులకు ఈ సినిమా ఓ చక్కటి సందేశం ఇస్తుంది. ఆధునిక ప్రపంచంలో చాటింగుల మోజులో చీటింగ్ కి గురయ్యి… జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్న వారికి ఈ సినిమా కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది.

సునీల్ చాలారోజుల తరువాత మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అమ్మాయిలతో సరదాగా గడిపే పాత్రలో చక్కగా నటించి మెప్పించాడు. బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ రివెంజ్ తీర్చుకునే అగ్రెసివ్ అన్న పాత్రలో నటించాడు.స్త్రీ ఔన్నత్యం గురించి యండమూరి అత్యద్భుతంగా రాసిన రెండు పేజీల డైలాగ్ ను కౌశల్ అంతే అద్భుతంగా సింగిల్ టేక్ లో చెప్పి ఆకట్టుకున్నాడు. భగ్న ప్రేమికురాలిగా కల్పన పాత్ర పోషించిన అమ్మాయి… నేటితరం అమ్మాయిల భావాలను ప్రతిభింబించేలా కనిపించే ప్రేమ పాత్రలో నటించిన అమ్మాయి మహేశ్వరి… కౌశల్ చెల్లెలు పాత్రలో నటించిన దియా.. తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఆస్ట్రో నాట్ సయింటిస్ట్ గా… భార్య మనోభావాలను గౌరవించే భర్త పాత్రలో సీనియర్ నటుడు బెనర్జీ చక్కగా నటించి మెప్పించాడు.

దర్శకుడు యండమూరి రాసుకున్న కథ బాగుంది. కథనం ఇంకాస్త స్పీడుగా ఉంటే మరింత అలరించేది. సంభాషణలు చాలా డెప్త్ గా వున్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉంటే బాగుండేది. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ గా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. గో అండ్ వాచ్ ఇట్..!

రేటింగ్: 3