HomeTeluguఅటా లో జర్నలిస్ట్ మహ్మద్ రఫీ కి అభినందన సత్కారం

అటా లో జర్నలిస్ట్ మహ్మద్ రఫీ కి అభినందన సత్కారం

అటా కు వచ్చిన అతిధులను గౌరవంగా సత్కరించి తెలుగు సంప్రదాయాన్ని చాటి చెప్పారు! ప్రింట్ మీడియా బాధ్యతలను నిర్వహించి అటా వేడు కులకు విశేష ప్రచారం కల్పించినందుకు సీనియర్ పాత్రికేయులు, కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ ని ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. అమెరికా వాషింగ్టన్ డిసి లో జులై 1 నుంచి మూడు రోజుల పాటు అంగ రంగ వైభవంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (అటా) 17వ మహా సభలు జరిగాయి. ఈ సభలకు మీడియా కో ఆర్డినేటర్ గా మహ్మద్ రఫీ హాజరయ్యారు.

మహా సభలు దిగ్విజయం గా ముగిసిన అనంతరం అటా కల్చరల్ టీమ్ సక్సెస్ మీట్ వర్జినియా లోని అతిధి హోటల్ లో నిర్వహించారు. మహ్మద్ రఫీ సేవలను అభినందించి ప్రత్యేకంగా సన్మానించారు. అటా వేడుకలు దిగ్విజయం అవడం లో, ఆయా విశేషాలను ఎప్పటికప్పుడు ప్రపంచం లోని తెలుగు ప్రజలకు చేరువ చేయడం లో మహ్మద్ రఫీ కీలక పాత్ర పోషించారని అటా కన్వీనర్ సుధీర్ బండారు అభినందించారు.

శ్రీకాకుళం నుంచి భారత ప్రభుత్వ సాంస్కృతిక సంబంధాల సంస్థ (ఐసి సిఆర్) సౌజన్యం తో వచ్చిన కూచిపూడి నాట్య గురు శ్రీకాంత్ రఘుపాత్రుని శిష్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి ధ్వన్యనుకరణ తపస్వి శ్రీ మిమిక్రీ రమేష్ వ్యాఖ్యాత గా వ్యవహరించారు.

ఈ వేడుక లో అటా అధ్యక్షులు భువనేష్ భుజాల, ముఖ్య ప్రతినిధులు శ్రావణి, దీపిక భువనేష్, హాస్పిటాలిటీ చైర్మన్ అమర్ రెడ్డి, కల్చరల్ చైర్మన్ గోపాల్ నున్నా, ఫుడ్ కమిటీ చైర్మన్ వి.విశ్వ ప్రసాద్, హాస్పిటాలిటీ టీమ్ లీడర్ లోహిత్ రెడ్డి, ఆహ్లాదిత తదితరులు పాల్గొన్నారు.

వి. రవళి
(వాషింగ్టన్ డిసి నుంచి )

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES