కరోనా లాక్ డౌన్ పుణ్యమా అంటూ సినిమా థియేటర్లు మూతపడటంతో కమర్షియల్ సినిమాకు అలవాటు పడిన సగటు ప్రేక్షకుడికి సినిమా దూరం అయిందనే చెప్పాలి. ఆ దూరాన్ని పూడుస్తూ ఓ టి టి లు వచ్చినప్పటికీ అవి ధియేటర్ లో సినిమా చూసిన అనుభవాన్ని ఇవ్వకపోవడం, ఆ సినిమాలలో కూడా అన్నీ పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోకపోవడం వంటివి సిని అభిమానులు హాళ్ళు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అనే ఆశాభావంతో ఎదురు చూసేలా చేశాయి. ఈ మధ్య విడుదల అయిన ఆరంభం అనే మినీ మూవీ మాత్రం తెలుగు ప్రేక్షకులను లాక్ డౌన్ కష్టకాలంలో కూడా ఆలోచించేలా చేస్తుంది, ఆ సినిమాలో రాకేందు మౌళి హీరోగా నటించాడు, దర్శకుడు శంకర్ విస్సా.
రాకేందు ఈ సినిమా గురించి మాట్లాడుతూ “మన దేశ విద్యా వ్యవస్థను ప్రశ్నిస్తూ, మన ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలను మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ, గాడి తప్పిన ఈ విద్యా విధానం వలన స్టూడెంట్స్ ఇన్ని ఇబ్బందులు ఎదురుకుంటున్నారు, తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది చాలా గొప్పగా చెప్పాడు మా దర్శకుడు “శంకర్ విస్సా” తను కొత్త దర్శకుడు అయినప్పటికీ తొలి సినిమాతోనే తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నాడు. ఈ సినిమా చూసిన అందరూ నాకు ఫోన్ చేసి మేకింగ్ గురించి మాట్లాడుతు కమ్మర్షియల్ ఎలెమెంట్స్ తో అద్భుతమైన సందేశాన్ని చెప్పారు అని చెప్తున్నారు, ఇంకా ఒక విద్యార్ధికి ఏ రకమైన విద్య అవసరం అనేది, ప్రభుత్వాలు, కార్పోరేట్ వ్యవస్థతో కలసి మన విద్యా విధానాన్ని ఎలా పాడు చేసాయో బాగా చూపించాం అని అందరూ చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు రాకేందు మౌళి. దర్శకుడు శంకర్ విస్సా మాట్లాడుతూ నా సినిమాలో కథ ఎంత బాగుందో, మా హీరో రాకేందు మౌళి నటన కూడా అంతే బాగుంది, సిని పరిశ్రమ పెద్దలు, ప్రేక్షకులు.., అందరూ ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడుతుంటే మంచి సినిమా సమాజానికి అందించినందుకు సంతోషంగా ఉంది అని తెలిపారు.
ఈ కాళీ టైం లో ఒక మంచి సినిమా చూడాలి అనుకునే ప్రేక్షకుడికి “ఆరంభం” ఒక గొప్ప సినిమాను చూసిన అనుభూతిని తప్పక ఇస్తుంది అని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సినిమా యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది.
ఈ సినిమాకు తమిళ లో కేడి అనే సినిమా ద్వారా జాతీయ అవార్డు అందుకున్న కార్తికేయ మూర్తి సంగీతం అందించగా, దుర్గా కిషోర్ సినిమాటోగ్రఫి అందించారు.