దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్‌ రాజ్‌పుత్‌

68


దేశభక్తిని చాటుకునే ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా ఏ ఒక్కరు కూడా వదులుకోవద్దని తీస్‌మార్‌ఖాన్‌ సినిమా హీరో ఆది సాయికుమార్, హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ అన్నారు. మంగళవారం కొండాపూర్‌లోని శరత్‌సిటీ మాల్‌లో రెడ్‌ ఎఫ్‌ఎం నిర్వాహకులు పక్కా లోకల్‌ పేరుతో ఇండిపెండెంట్‌ సంగీత కళాకారులతో నిర్వహించిన కార్యక్రమాలు వారు ముఖ్య అతిథులుగా పాల్గొని సందడి చేశారు. ఈ ఇండిపెండెంట్‌ సంగీతంలో ట్రెండింగ్‌ గాయకులైన ప్రవీణ్‌ కుమార్, అదితి భావరాజు, మనోజ్‌కుమార్, రౌద్ర, చౌరస్తా బ్రాండ్‌ బృందం పాల్గొని తమ పాటలతో ఉర్రూతలూగించారు. వజ్రోత్సవాల్లో భాగంగా దేశ భక్తిని చాటే పాటలు కూడా ఆలపించారు. ఈ సందర్భంగా ఇండిపెండెంట్‌ సంగీత కళాకారులను సినీ హీరో ఆది సాయికుమార్‌ సత్కరించారు.