నటిగా అందరికీ చిర పరిచితురాలైన అస్మిత యూట్యూబర్ గా చేసిన ప్రయాణం ఇప్పడు ఒకసక్సెస్ స్టోరీ గా మారింది. యాష్ ట్రిక్స్ పేరుతో అస్మి త చేసిన వీడియోలు ఆమెకు చాలా మంది అభిమానులను సొంతం చేసాయి. సీరియల్స్ లో, వెండితెర మీద నటిగా సక్సెస్ పుల్ కెరియర్ ని లీడ్ చేస్తున్న టైంలో వచ్చిన ఆలోచన ఇప్పుడు ఒక పెద్ద సక్సెస్ గా మారింది. యాష్ ట్రిక్స్ ఇప్పుడు డిజిటల్ మీడియా లో పేరు కాదు బ్రాండ్ గా అవతరించింది. మేకప్ కిట్ లు ఎలా తయారు చేసుకోవాలి.. ఏ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది వంటి వీడియోస్ తో పాటు అస్మిత చేసిన మోటివేషనల్ వీడియోలు ఇప్పుడు అభిమానులను కుటుంబ సభ్యులుగా మార్చాయి. తనపై తనకు ఉన్న నమ్మకంతో పాటు జీవిత భాగస్వామి సుధీర్ అందించిన సహాకారంతో యాష్ ట్రిక్స్ ఇప్పుడు డిజిటల్ మీడియాలో సంచలనంగా మారింది. నిజాయితీ తో కూడిన సమాచారం నమ్మిదానిపై నిలబడే మనస్థత్వం అస్మితను డిజిటల్ మీడియా లో ఒక బ్రాండ్ గా మార్చాయి. తన సొంత వ్యక్తిత్వం తో లక్షలాది మంది అభిమానం సంపాదించుకున్న అస్మిత ఇప్పడు ఎంటర్ టైన్మెంట్ రంగంలో మరో అడుగు ముందుకు వేసారు. A1 from Day1 వెబ్ సిరీస్ ని రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ ప్రివ్యూ కి యాష్ ట్రిక్స్ ఫ్యామిలీ ని ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అస్మిత మాట్లాడుతూః
నటిగా నా కెరియర్ బాగా బిజీ గా ఉన్న టైంలో నేను డిజిటల్ మీడియా వైపు అడుగులు వేసాను. టివి సీరియల్స్ లో బిజీ గా ఉన్నాను. సినిమాలలో అవకాశాలు బాగున్నాయి. ఇప్పుడు ఇదంతా ఏంటి అనే ప్రశ్నలు తోటి నటీ నటుల నుండి వచ్చాయి. దీన్ని ఎవరు చూస్తారు అనే కామెంట్స్ కూడా విన్నాను. అయితే అప్పుడు నన్ను ఎగతాళి చేసిన వారందరూ తర్వాత యూ ట్యూబ్ ఛానెల్స్ ని మొదలు పెట్టడం నాకు ఆనందంగా ఉంది. యాష్ ట్రిక్స్ విజయం వెనుక నా భర్త సుధీర్ సహాకారం చాలా ఉంది. పెళ్ళి , పిల్లలతో మహిళ ల కెరియర్ ఆగిపోతుందనే కాన్సెప్ట్ నాకసలు అర్దం కాదు , నేను నమ్మను.. అదే నమ్మకంతో యాష్ ట్రిక్స్ ని మొదలు పెట్టాను. అసలు ఏలాంటి వీడియోలు చేయాలి అని మొదట చాలా ఆలోచించే వాళ్ళం మన డైలీ రోటీన్ అవసరం అయ్యే విషయాలే మా వీడియోస్ కి ముడి సరకు చేసుకునే వాళ్ళం. ప్రతి కామెంట్ ని చదివే వాళ్లం వారికి రిప్లై ఇచ్చే వాళ్లం ఇప్పుడు యాష్ ట్రిక్స్ ఒక బ్రాండ్ గా మారిందంటే అది వ్యూ వర్స్ కి మా మీద ఉన్న నమ్మకమే కారణం. నిజాయితీగా ప్రయత్నిస్తూ నమ్మకాన్ని పొందాం. ఇప్పుడు యాష్ ట్రిక్స్ నుండి ఒక వెబ్ సిరీస్ ని విడుదల చేస్తున్నాం. సుధీర్ , నేను భార్య భర్తలుగా నటిస్తున్న ఈ సిరీస్ లో కమెడియన్ ఆలీ గారు ముఖ్యమైన పాత్రను పోషించారు.
డిసెంబర్ 10న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దీనిని చూసేందుకు రూ. 59.00 ధర నిర్ణయించాం. మా సిరీస్ కి సబ్ స్క్రిప్షన్ మొదలు అయ్యింది. తప్పకుండా ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందని నమ్మాము. ప్రివ్యూ తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే మా నమ్మకం నిజం అయ్యిందనిపిస్తుంది. అన్నారు.
దర్శకుడు, నటుడు సుధీర్ మాట్లాడుతూః
యాష్ ట్రిక్స్ సక్సెస్ ఒక సుధీర్గ మైన ప్రయాణం. ఒక చిన్న టీం తో మొదలైన మా ప్రయత్నం ఒక బ్రాండ్ గా మారడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు A1 from Day1 వెబ్ సిరీస్ మొదలు పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు అవకాశాలు కోసం ప్రయత్నించాం.. కానీ అవకాశాల కోసం ప్రయత్నించడం కంటే వాటిని సృష్టించుకోవడం మేలు అని గ్రహించాం. అందుకే మా కంటెంట్ మీద నమ్మకంతో పే ఫర్ వ్యూ కేటగిరీలో వెబ్ సిరీస్ ని ఉంచాం. మేకింగ్ లో క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. భార్య భర్తల మద్య ఉండే అల్లరి అలకలను అందంగా చిత్రీకరించాం. డిసెంబర్ 10న సాయత్రం 5.30 pm కి స్ట్రీమింగ్ అవుతుంది. నా నటనకు కూడా ప్రశంసలు దక్కుతుంటే ఆనందంగా ఉంది. ప్రివ్యూ కి వచ్చిన రెస్పాన్స్ మాకు చాలా నమ్మాకాన్ని ఇచ్చింది. అన్నారు.