మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న “ఏ స్టార్ ఈజ్ బార్న్”

105

కొత్తవారికి టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటుంది. కళ్యాణ్ శివ్ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త సినిమా “ఏ స్టార్ ఈజ్ బార్న్”. వీజే సాగర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం అందిస్తున్నారు. సి.రవి సాగర్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ప్రియా పాల్, నేహా శర్మ, ఊహ రెడ్డి ముగ్గురు నూతన కథానాయికలు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. క్యారక్టర్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో పక్కా కమర్షియల్‌ ఎంటర్టైన్మెంట్ సినిమాగా రాబోతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి అయినట్లు చిత్ర బృందం వెల్లడించింది. తెలంగాణలోని వనపర్తి, కొల్లాపూర్, సోమశిల,జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో హీరో,హీరోయిన్ ల మధ్య సన్నివేశాల చిత్రీకరణతో మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకోగా ఈ సినిమా లో 93 మంది కొత్త, పాత నటీనటులు నటిస్తుండడం విశేషం. రెండో షెడ్యూల్ ను త్వరలోనే సన్నాహాలు చేస్తామని వెల్లడించారు. నళినీకాంత్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండటం విశేషం.

నటీనటులు

కళ్యాణ్ శివ్,  ప్రియా పాల్, నేహా శర్మ, ఊహ రెడ్డి, RX100 దయానంద్, మహేంద్రనాథ్, మాధవి, లక్ష్మి, సంధ్య, రిష, భరత్, వినయ్ నవీన్ శ్రీరామ్, మాష్టర్ రిషి, మాష్టర్ అభయ్ , బేబీ భవ్య శ్రీ తదితరులు

సాంకేతిక నిపుణులు :
నిర్మాత : సి.రవి సాగర్
దర్శకత్వం : విజె సాగర్
సంగీతం : సునీల్ కశ్యప్
కెమెరా : నళినీకాంత్,
కొరియోగ్రఫీ : అజయ్ శివశంకర్

పీఆర్వో : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.