లవ్ మౌళి మూవీ సాంగ్ ప్రోమో కి అనూహ్య స్పందన

129

నవదీప్ చాలా రోజులు తరువాత నటిస్తున్న చిత్రం లవ్ మౌళి. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గుబురు గడ్డం.. ఒక బైక్.. ట్రావెలర్ గా కనిపించి మెప్పించాడు. తాజాగా ఈ సినిమా నుండి థ ఏoథమ్ ఆఫ్ లవ్ మౌళి సాంగ్ ప్రోమో వచ్చింది . ఈ ప్రోమో చూస్తేనే ఇలా ఉంటే సాంగ్ వస్తే ఎవరు ఊహించని రీతిలో ఉంటుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు . ఈనెల 15 న వినాయక చవితి సందర్భంగా రిలీజ్ అవుతుంది
ఈ సినిమా కోసం అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారు గోవింద్ వసంత.తాటికొండ ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.

నటీనటులు: నవదీప్ ,పంఖురి గిద్వానీ, మిర్చి హేమంత్

దర్శకులు : అవనీంద్ర

నిర్మాతలు: తాటికొండ ప్రశాంత్

సంగీత దర్శకులు: గోవింద్ వసంత

సినిమాటోగ్రఫీ: అవనీంద్ర

ఎడిటర్ : అవనీంద్ర