HomeTeluguఘనంగా ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా మూవీ "పా పా" ట్రైలర్ లాంఛ్, ఈ నెల...

ఘనంగా ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా మూవీ “పా పా” ట్రైలర్ లాంఛ్, ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా

కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ “డాడా” తెలుగు ప్రేక్షకుల ముందుకు “పా పా” పేరుతో వస్తోంది. ఈ చిత్రానికి గణేష్ కె బాబు దర్శకత్వం వహించారు. “పా పా” చిత్రాన్ని జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నీరజ కోట తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 13న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా “పా పా” చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ – ఇప్పుడే “పా పా” మూవీ ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ తో పాటు వారి బాబు పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకోవాలి. కొత్త ప్రొడ్యూసర్ నీరజ కోట గారికి “పా పా” చిత్రంతో ఘన విజయం దక్కాలి. సురేష్ కొండేటి ఏ సినిమా సక్సెస్ అవుతుందో బాగా గెస్ చేయగలడు. ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు చెబుతున్నాం. అఖండ 2 టీజర్ చూశాను. ఫ్యాన్స్ కు పండగ అప్పుడే మొదలైన ఫీలింగ్ కలిగింది. అన్నారు.

దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ – మా సురేష్ కొండేటి ఎన్నో తమిళ మూవీస్ ను తెలుగులోకి తీసుకొచ్చారు. బడ్జెట్ లో చేసిన తమిళ చిత్రాలు కూడా తెలుగులో మంచి వసూళ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. “డా డా ” సినిమా తమిళంలో 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే తెలుగులో “పా పా” పేరుతో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ ఆకట్టుకుంది. ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాత నీరజ కోట గారికి పేరు, డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నా. మా నటసింహం బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నారు.

ప్రొడ్యూసర్ నీరజ కోట మాట్లాడుతూ – మా జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద చేస్తున్న ఫస్ట్ మూవీ “పా పా”. ఈ చిత్రం తమిళంలో”డా డా ” పేరుతో రిలీజై ఘన విజయాన్ని సాధించింది. అలాంటి విజయమే తెలుగు ప్రేక్షకులు కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నా. ఈ రోజు మా మూవీ ట్రైలర్ లాంఛ్ కు వచ్చి సపోర్ట్ అందించిన డైరెక్టర్స్ కోదండరామిరెడ్డి గారికి, బి. గోపాల్ గారికి థ్యాంక్స్. అన్నారు.

ప్రొడ్యూసర్ నీరజ కోట భర్త శశికాంత్ మాట్లాడుతూ – మనుషులుగా మనం ఎంత ఆధునిక జీవితాన్ని సాగిస్తున్నా మనలోని హ్యూమన్ ఎమోషన్స్, విలువలు మారవు. అవి అలాగే ఉంటాయని చెప్పే చిత్రమిది. మేము ఈ చిత్రాన్ని తీసుకున్నాక…ఇండస్ట్రీలోని కొందరు పెద్ద మనుషుల నుంచి తమకు సినిమా ఇవ్వమని ఒత్తిడి చేశారు. ఆ ప్రెజర్ ను మాటల్లో చెప్పలేము. ఈ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన కూడా చేశాం. అయితే రీమేక్ చేస్తే ఒరిజినల్ మూవీలోని ఎమోషన్స్ పండవు అనిపించింది. ఒక మంచి హ్యూమన్ వ్యాల్యూస్, ఎమోషన్స్ ఉన్న చిత్రం “పా పా” అనేది మీడియా మిత్రులు ప్రేక్షకులకు తెలియజెప్పాలని కోరుతున్నా. అన్నారు.

నటీనటులు – కవిన్, అపర్ణా దాస్, భాగ్యరాజ, వీటీవీ గణేష్, ఐశ్వర్య, ప్రదీప్ శక్తి, తదితరులు

టెక్నికల్ టీమ్
ప్రొడక్షన్ హౌస్ – జేకే ఎంటర్ టైన్ మెంట్స్
ప్రొడ్యూసర్ – నీరజ కోట
కో ప్రొడ్యూసర్స్ – శశాంక్ చెన్నూరు, శ్రీకాంత్ నూనెపల్లి, వెంకట్ బొమ్మరాజు
మ్యూజిక్ – జెన్ మార్టిన్
లిరిసిస్ట్ – రవి వర్మ ఆకుల
పీఆర్ఓ – సురేష్ కొండేటి

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES