లవ్ మౌళి మూవీ నుంచి అందాలు చదివే కళ్ళకైనా అనే క్రేజీ సాంగ్ విడుదల.

134

టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ చాలా రోజులు తరువాత నటిస్తున్న చిత్రం లవ్ మౌళి. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గుబురు గడ్డం.. ఒక బైక్.. ట్రావెలర్ గా కనిపించి మెప్పించాడు. తాజాగా ఈ సినిమా నుండి థ ఏoథమ్ ఆఫ్ లవ్ మౌళి సాంగ్ ను రిలీజ్ చేశారు. “అందాలు చదివే కళ్లకైనా.. కందాలు తిరిగే కాళ్లకైనా.. వందేళ్లు కదిలే గుండె కైనా.. ప్రేమన్న తీరం ఇదేనా.. ” అంటూ సాగే పాటలో.. నవదీప్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. నవదీప్ 2.0 అంటూ ఈ మూవీతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా, పొడవాటి జుట్టు గుబురు గడ్డంతో సరికొత్త మేకోవర్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. గోవింద వసంత మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాచి లిరిక్స్ రాశారు. అనిల్ కృష్ణన్ పాడిన విధానం అందర్నీ ఆకట్టుకుంటుంది. మేఘాలయలోని చిరపుంజీలో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని చిత్రీకరించారు. ఇలాటి వెట్ ప్లేస్ లో షూటింగ్ జరిగిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ గా ఈ చిత్రం నిలిచింది. అలాగే థాయ్ కుడెం బ్రిడ్జి షూట్ చేశారు. తాటికొండ ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నటీనటులు: నవదీప్ ,పంఖురి గిద్వానీ, మిర్చి హేమంత్
దర్శకులు : అవనీంద్ర
నిర్మాతలు: తాటికొండ ప్రశాంత్
సంగీత దర్శకులు: గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ: అవనీంద్ర
ఎడిటర్ : అవనీంద్ర
పిఅర్ఓ : ఏలూరు శ్రీను- మధు మడూరి