HomeTelugu30 ఇయర్స్ పృథ్వి చేతుల మీదుగా `నీతోనే హాయ్ హాయ్‌` ఆడియో లాంచ్

30 ఇయర్స్ పృథ్వి చేతుల మీదుగా `నీతోనే హాయ్ హాయ్‌` ఆడియో లాంచ్

కేయ‌స్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై డా.య‌ల‌మంచిలి ప్ర‌వీణ్ స‌మ‌ర్ప‌ణ‌లో అరుణ్ తేజ్ , చ‌రిష్మా శ్రీక‌ర్ జంట‌గా బియ‌న్ రెడ్డి అభిన‌య ద‌ర్శ‌క‌త్వంలో డా.య‌ల‌మంచిలి ప్ర‌వీణ్‌, డా.ఏయ‌స్ కీర్తి, డా.జి.పార్థ సార‌ధి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `నీతోనే హాయ్ హాయ్‌`. ఈ చిత్రం ఆడియో ఇటీవల తిరుపతి లో నటుడు 30 ఇయర్స్ పృథ్వి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…“ఎస్వీబిసి ` చైర్మైన్ అయిన తర్వాత నేను హాజరైన మొదటి ఆడియో ఫంక్షన్ `నీతోనే హాయ్ హాయ్‌`. ఇందులో ఐదు పాటలు చాలా బావున్నాయి. ముగ్గురు నిర్మాతలు మంచి అభిరుచి తో చిత్రాన్ని నిర్మించారు. హీరో , హీరోయిన్స్ మంచి నటన కనబరిచారు. ట్రైలర్ చూస్తుంటే దర్శకుడి ప్రతిభ ఏంటో తెలుస్తుంది. కంటెంట్ బావుంటే కొత్త , పాత లేకుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. ఈ సినిమా కూడా విజ‌య‌వంతం కావాలని కోరుకుంటూ యూనిట్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు“ అన్నారు.
ద‌ర్శ‌కుడు బియ‌న్ రెడ్డి అభిన‌య మాట్లాడుతూ…“ఎస్వీబిసి ` చైర్మైన్ అయిన తర్వాత మొదటిసారిగా మా ఆడియో ఫంక్షన్ కి పృథ్వి గారు రావడం చాలా సంతోషం గా ఉంది. ఇక నిర్మాత‌లు న‌న్ను , నా క‌థ‌ని న‌మ్మి ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను నిర్మించారు. పాట‌ల షూటింగ్ కోసం వెళ్లిన‌ప్పుడు చిక్ మంగుళూరు లో కొన్ని స‌మ‌స్య‌లు ఎదురైనా వాట‌న్నింటినీ అధిగ‌మించి షూటింగ్ కంప్లీట్ చేశాం. ఇటీవల సెన్సార్ పూర్తి చేసాం. సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. సినిమాను ఈ నెల 23 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.
హీరో అరుణ్ తేజ్ మాట్లాడుతూ…“ ఒక మంచి సినిమాలో పార్ట్ ఐందుకు హ్యాపీ. హీరోగా బ్రేక్ వస్తుందన్న నమ్మకం తో ఉన్నాను. అన్ని వ‌ర్గాల వారికి న‌చ్చే విధంగా సినిమా ఉంటుంద‌ని` అన్నారు.
నిర్మాత డా.పార్థ‌సార‌ధి రెడ్డి మాట్లాడుతూ…“ఎన్నో వ్య‌య ప్ర‌యాల‌స‌కోర్చి సినిమా చేశాం. మా తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా“ అన్నారు.
డా.ఏయ‌స్ కీర్తి మాట్లాడుతూ…“ఇటీవల కాలం లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలను ఆదరిస్తున్నారు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న మా సినిమాను కూడా ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా` అన్నారు.
మరో నిర్మాత , స‌మ‌ర్ప‌కులు డా. య‌ల‌మంచిలి ప్రవీణ్ మాట్లాడుతూ…“ఎంతో పాష‌న్ తో ఈ సినిమా చేశాం. అంతే పాష‌న్ తో ఉన్న ద‌ర్శ‌కుడు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా చేశారు. గ్రాండ్ గా సినిమాను ఈ నెల 23 న రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES