ఆడియన్స్ కి మంచి కంటెంట్ అందిస్తే యూట్యూబ్ న్యూస్ చాన్నాళ్లకు మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా సినిమా న్యూస్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇండస్ట్రీలో జరిగే లేటెస్ట్ అప్ డేట్స్ ని ఇస్తే… అలాంటి యూట్యూబ్ కి మరింత ఆదరణ లభిస్తుంది. అందుకే “సంతోషం” మేగజైన్ ఎడిటర్ తాజాగా “సంతోషం సురేష్ యూట్యూబ్” ఛానెల్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ ను గత ఏడాది కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రారంభించి… ఎప్పటికప్పుడు సినిమా న్యూస్ ని ఆడియన్స్ కి అందిస్తున్నారు. ఇది దిగ్విజయంగా 500 ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేసుకుంది.
కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా… సినిమా రంగానికి చెందిన లేటెస్ట్ న్యూస్ ని అందిస్తూ… ఆడియన్స్ ని అలరిస్తున్నారు. కొత్త కొత్త అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అలరిస్తున్నారు ఛానెల్ అధినేత సురేష్ కొండేటి.
గత 20 ఏళ్లుగా సంతోషం మేగజైన్ ఎడిటర్ గా… పబ్లిషర్ గా సినిమా ప్రేమికుల అటెన్షన్ ని స్థిరంగా ఉంచుకున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ట్రెండ్ నడుస్తుండటంతో… ఇందులోనూ రోజు రోజుకు సబ్ స్క్రైబర్స్ ని పెంచుకుంటూ మూవీ అప్ డేట్స్ విషయంలో ప్రత్యేక స్థానం నిలబెట్టుకున్నారు.