HomeTelugu"వన్ బై టు" టీజర్ విడుదల

“వన్ బై టు” టీజర్ విడుదల

డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా నటిస్తున్న సినిమా “వన్ బై టు”. చెర్రీ క్రియేటివ్ వర్క్స్, బ్యానర్ పై కరణం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దారం ప్రభుదాస్ సమర్పకులు. “వన్ బై టు” చిత్రానికి శివ ఏటూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా “వన్ బై టు” సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

వన్ బై టు” టీజర్ ఎలా ఉందో చూస్తే…సాయికుమార్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళను శిక్షించే పాత్రలో సాయికుమార్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. అమ్మాయిలపై యాసిడ్ దాడులు మరియు పసిపిల్లల పై అత్యాచారం వంటి సంఘటనలకి ఇందులో చూపించిన పరిష్కారం చాలా వైల్డ్ గా ఉంది. విజయ భారతి (సుదర్శన్ కరమల) రాసిన “ఆడవాళ్ళ జోలికొస్తే తగలెట్టేస్తా, నేను ఎంటరైతే విశ్వరూపమే” లాంటి సాలీడ్ డైలాగ్స్ చాలా ఆకట్టుకుంటున్నాయి. “వన్ బై టు” వుమెన్ ప్రొటెక్షన్ గురించి రూపొందించిన ఓ పవర్ ఫుల్ మూవీ అని టీజర్ తో అర్థమవుతోంది.

షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న “వన్ బై టు” చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడ, హిందీలో కూడా డబ్బింగ్ చేసి థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. త్వరలో చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించనున్నారు.

సాంకేతిక వర్గం – కో-ప్రొడ్యూసర్ – వెంకట రమణ పసుపులేటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – జానకి రామారావు పామరాజు, మ్యూజిక్ – లియాండర్ లీమార్టీ & ఆదేశ్ రవి, డైలాగ్స్ – విజయ భారతి, కెమెరా – శంకర్ కేసరి, ఎడిటర్ – JP, లిరిక్స్ – బాలవర్ధన్ & స్వర్ణ నాయుడు, డాన్స్ – కపిల్, ఫైట్స్ – శంకర్, నిర్మాత – కరణం శ్రీనివాసరావు, దర్శకత్వం – శివ ఏటూరి.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES