సందేశాత్మక అంశాలను కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి. తన పంథాలో ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం హనీ ట్రాప్. రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వివి వామన రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివి వామనరావు ఈ చిత్రానికి నిర్మాతగానే కాకుండా కథా స్క్రీన్ ప్లే అందించి ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. ప్రవీణ్ ఇమ్మడి సంగీతాన్ని అందించిన హనీ ట్రాప్ మూవీ ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె అతిథులుగా పాల్గొని చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఆర్పీ మాట్లాడుతూ…సొసైటీకి అవసరం అయ్యే పాయింట్ తో కమర్షియల్ గా సినిమాలు చేయడం సునీల్ కుమార్ రెడ్డి గారి ప్రత్యేకత. ఒక కమిట్ మెంట్ తో సినిమాలు చేసే ఆయనంటే నాకు గౌరవం. సినిమా ఊరికే వినోదాన్ని అందించేది కాదు దానికో పర్పస్ ఉంటుందని నమ్మే దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి. హనీ ట్రాప్ అనేది మన రియల్ లైఫ్ లో వింటుంటాం. గొప్ప పేరున్న వ్యక్తులు వ్యక్తులు ఇలాంటి హనీ ట్రాప్ లో పడి తమ పేరు పాడు చేసుకుంటారు. ఈ మూవీని సునీల్ కుమార్ గారు ఎంత బాగా తీసుంటారో ఊహించగలను. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ…ఇలా ఓ సినిమా ఆడియో సీడీ పట్టుకుని చాలా రోజులవుతోంది. అంతా డిజిటల్ అయ్యాక, ఆడియో సీడీలు కనిపించడం లేదు. మల్లీ హనీ ట్రాప్ ఆడియోతో మాకు ఇలాంటి అవకాశం కల్పించారు. సునీల్ కుమార్ రెడ్డి గారి చిత్రాల్లో నాకు గల్ఫ్ సినిమా బాగా ఇష్టం. ఆ సినిమాలో గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి మన వాళ్లు పడే ఇబ్బందులు ఎంతో సహజంగా చూపించారు. నాకు సునీల్ గారి సినిమా లో నటించే అవకాశం వచ్చింది. మంచి సినిమా తో త్వరలో మీ ముందుకు వస్తాము. హనీ వెనుక ట్రాప్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాదించాలి అని అన్నారు.
సాహిత్యాన్ని అందించిన యెక్కలి రవీంద్ర బాబు మాట్లాడుతూ…హనీ ట్రాప్ మూవీకి మా వామనరావు గారు మంచి కథా స్క్రీన్ ప్లే అందించారు. ఆ కథా స్క్రీన్ ప్లేను సునీల్ కుమార్ రెడ్డి గారు ఆసక్తికరంగా తెరకెక్కించారు. నాకు ఈ సినిమాలో పాటల రాసే అవకాశం కలిగింది. పాటలు బాగా వచ్చాయి. అన్నారు.
నటుడు శివ కార్తీక్ మాట్లాడుతూ…సునీల్ కుమార్ రెడ్డి గారు మాకు గురువు లాంటి వారు. ఆయన గతంలో గల్ఫ్ అనే సినిమాలో నాకు క్యారెక్టర్ ఇచ్చారు. ఆయనతో ఇది నాకు రెండో సినిమా. హనీ ట్రాప్ లో మంచి క్యారెక్టర్ లో నటించే అవకాశం కల్పించారు. మా సినిమాను విష్ చేసేందుకు వచ్చిన ఆర్పీ పట్నాయక్ గారికి, రఘు కుంచె గారికి థాంక్స్. అన్నారు.
నిర్మాత వివి వామనరావు మాట్లాడుతూ…నేను కథా రచయితగా ఎలా సినిమాను ఊహించుకున్నానో, అంతకన్నా బాగా సునీల్ కుమార్ రెడ్డి గారు తెరకెక్కించారు. నేను రాసిన స్క్రీన్ ప్లే బాగుందంటూ ఆయన ఎంకరేజ్ చేశారు. ఫ్యూచర్ లోనూ మా జర్నీ ఇలాగే కొనసాగుతుంది. హనీ ట్రాప్ సినిమా ప్రివ్యూ చూసిన వాళ్లంతా చాలా బాగుందని చెప్పారు.
శ్రీలక్ష్మీ ఫిలింస్ బాపిరాజు గారు హనీ ట్రాప్ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారు. గతంలో ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్ చిత్రాలు మంచి విజయవంతం అయ్యియి, ఇప్పుడు ఈ హనీ ట్రాప్ సినిమా కూడా అంతే విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంది. ఈ వర్షాకాలంలో వేడి పుట్టించే సినిమా అవుతుంది. మా కాంబినేషన్ లో మరో రెండు సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయి. అన్నారు.
దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…నా టీమ్ మెంబర్స్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటారు. మా అసోసియేషన్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంటుంది. సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి నాతో గంగపుత్రులు సినిమా నుంచి 12 ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నారు. వర్క్ బిజీలో ఈ కార్యక్రమానికి ఆయన రాలేకపోయారు. రఘు కుంచె గారు మా టీమ్ లో మెంబర్ అయినందుకు సంతోషం. ఆర్పీ పట్నాయక్ గారు మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. వామనరావు గారు నిర్మాతే కాదు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు, ఎంతో మంది జీవితాలను దగ్గర నుంచి చూశారు. ఆయన రాసిన నాటకాలకు నంది ఆవార్డులు వచ్చాయి, సీరియల్స్ జనాదరణ పొందాయి. అలాంటి ప్రతిభాశాలితో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్ లో బెస్ట్ డైలాగ్స్ కు నంది ఆవార్డ్స్ తీసుకున్నాను. వామనరావు గారు హనీ ట్రాప్ అనే కథను చెప్పగానే ఈ కథలో కమర్షియల్ మూవీకి కావాల్సిన విషయం ఉందనిపించి, దీనిపై వర్కవుట్ చేయడం ప్రారంభించాం. వేసుకున్న బడ్జెట్ కుఒక్క రూపాయి పెరగకుండా జాగ్రత్త పడుతూ సినిమా షూటింగ్ చేశాం. ఆడియెన్స్ కు ఏం కావాలో చూసుకుంటూ, మా సెన్సిబిలిటీస్ కు తగినట్లు రూపొందించిన సినిమా హనీ ట్రాప్. మా గత హిట్ చిత్రాల్లాగే హనీ ట్రాప్ తప్పకుండా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.
రిషి, శిల్పా నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్, వామనరావు, ప్రసన్న కుమార్, సన, శశిధర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – ఎస్ వి శివరామ్, సంగీతం – ప్రవీణ్ ఇమ్మడి, ఎడిటర్ – నరేష్ కుమార్ మేడికి, సాహిత్యం – యెక్కలి రవీంద్రబాబు, దాకుపాటి రవిప్రకాష్, గాయకులు – ధనుంజయ్, పెండ్యాల శ్రీ ప్రసన్న, కథా స్క్రీన్ ప్లే, నిర్మాత – వి వి వామనరావు, మాటలు, దర్శకత్వం – పి సునీల్ కుమార్ రెడ్డి.
PRO; PAUL PAWAN