మజిలి, ఏజేంట్ శ్రీనివాస్ ఆత్రేయ లాంటి చిత్రాల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకుని కలర్‌ఫోటో లాంటి గ్రేట్ లవ్ స్టోరి లో తన నటనతో నవ్వించి కంట తడి పెట్టించిన సుహాస్ హీరోగా మెహెర్ తేజ్ దర్శకుడుగా పరిచయమవుతూ తేజా కాసరపు తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ఫ్యామలి డ్రామా.. ఈ చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఛష్మా ఫిలింస్ మరియు నూతన భారతి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యానర్లు నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి స్టోరి, స్క్రీన్ ప్లే ని మెహెర్ తేజ్ మరియు షణ్ముఖ ప్రసాంత్ లు అందిస్తున్నారు. కంచె, గౌతమి పుత్ర శాతకర్ణ లాంటి చిత్రాలకి ఎడిటర్ గా పనిచేసిన రామకృష్ణ ఆర్రామ్ ఈ ఫ్యామిలి డ్రామా కి ఎడిటింగ్ చేస్తున్నారు. అజయ్ అండ్ సంజయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేశారు. ఈ లుక్ లో సుహస్ కంచె వెనుక వుండటం, వీల్ ఛైర్ పై ఒకరు ఎదురుగా ఒకరు టైటిల్ కి అటు ఇటు గా వుండేలా ఒక డిఫరెంట్ ఫ్యామిలి డ్రామా ని తెరకెక్కించారనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే టైటిల్ కూడా ఒక బ్లేడ్ తో కటింగ్ వచ్చేలా డిజైన్ చేయడం ఆకట్టుకుంటుంది. ఫ్యామిలి డ్రామా అనే టైటిల్ కి భిన్నంగా ఈ పోస్టర్ ఉండటంతో ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో పాటు సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రానికి సంబందించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.
కుటుంబ సబ్యులు..
.
సుహస్ (కలర్‌ఫోటో ఫేం)
తేజ కాసరపు (నూతన పరిచయం)
పూజా కిరణ్ (నూతన పరిచయం)
అనుషా నూతుల (నూతన పరిచయం)
శృతి మెహర్ (నూతన పరిచయం)
సంజయ్ రథా (నూతన పరిచయం)
సమర్పణ .. మ్యాంగో మాస్ మీడియా
దర్శకుడు.. మెహెర్ తేజ్
స్టోరి, స్క్రీన్ ప్లే .. మెహెర్ తేజ్ మరియు షణ్ముఖ ప్రసాంత్
నిర్మాతలు .. మెహెర్ తేజ్, తేజా కాసరపు
సంగీతం .. అజయ్ అండ్ సంజయ్
బ్యానర్.. ఛష్మా ఫిలింస్ మరియు నూతన భారతి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి
కెమెరా.. వెంకట్ ఆర్ శాఖమూరి
ప్రోడక్షన్ డిజైనర్ .. ఎల్లయ్య. ఎస్
పిఆర్ఓ .. ఏలూరు శ్రీను, సునిల్ కొడూరి