యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `స్టాండప్ రాహుల్`. `కూర్చుంది చాలు` అనేది ట్యాగ్ లైన్. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
రాజ్‌తరుణ్ కెరీర్‌లోనే ఒక డిఫరెంట్ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఇలాంటి జోనర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో పాటు టైటిల్ ఆసక్తికరంగా ఉండడం,స్టైలిష్ మేకోవర్‌లో యూబర్-కూల్‌గా రాజ్‌తరుణ్ ఉన్న ఫస్ట్‌లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ఈ రోజు (మే11) యంగ్ హీరో రాజ్‌తరుణ్ పుట్టినరోజు సందర్భంగా `స్టాండప్ రాహుల్` చిత్రం నుండి మరో స్పెషల్ పోస్టర్ రిలీజ్‌చేసి శుభాకాంక్షలు తెలిపింది చిత్ర యూనిట్. క్రియేటివ్‌గా ఉన్న ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటిస్తుండగా స్వీకర్ అగస్తి సంగీతం, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫి నిర్వహిస్తున్నారు. వెన్నెలకిషోర్, మురళిశర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్ మరియు మధురిమ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
నటీనటులుః
రాజ్ తరుణ్, వర్షబొల్లమ్మ, వెన్నెలకిషోర్, మురళిశర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్ మరియు మధురిమ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
సాంకేతిక నిపుణులుః
రచన- దర్శకత్వం – సాంటో మోహన్ వీరంకి
నిర్మాణ సంస్థలు – డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్
సమర్పణ – సిద్ధు ముద్ద
నిర్మాతలు – నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి
సంగీతం – స్వీకర్ అగస్తి
సినిమాటోగ్రఫి – శ్రీరాజ్ రవీంద్రన్
ఎడిటర్ – రవితేజ గిరిజెల్ల
కొరియోగ్రాఫర్ – ఈశ్వర్ పెంటి
ఆర్ట్ – ఉదయ్
పిఆర్ఓ- వంశీ- శేఖర్.
Pro: Vamsi – Shekar
9581799555 – 9553955385