HomeTelugu"లైటింగ్ సూరిబాబు" కి గ్లింప్స్ తో బ‌ర్త్‌డే విషెష్ చెప్పిన "శ్రీదేవి సోడా సెంట‌ర్"...

“లైటింగ్ సూరిబాబు” కి గ్లింప్స్ తో బ‌ర్త్‌డే విషెష్ చెప్పిన “శ్రీదేవి సోడా సెంట‌ర్” యూనిట్‌

వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో సుధీర్ బాబు కి ప్ర‌త్యేక‌త వుంది. ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ లాంటి హ‌ర్ర‌ర్ కామెడి చిత్రం తో తెలుగు సినిమా ఇండ‌స్ట్రి కి ట్రెండ్ క్రియొట్ చేశారు. భ‌లేమంచి రోజు లాంటి విభిన్న‌మైన క‌థ‌నం తో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నారు. న‌న్నుదోచుకుందువ‌టే, స‌మ్మొహ‌నం చిత్రాల‌ తో యూత్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ కూడా ఆక‌ట్టుకున్నారు. క‌థ‌ల విష‌యంలో కంగారు లేకుండా ప్రేక్ష‌కుల అభిరుచి కి త‌గ్గ‌ట్టుగా చిత్రాలు చేస్తూ వెల్ టాలెంటెడ్ హీరోగా సుధీర్‌బాబు త‌న కెరీర్ ని కొన‌సాగిస్తున్నారు. అదేవిధంగా ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంట‌ర్‌.. ఈ టైటిల్ ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర‌నుండే ట్రెండ్ లో క్రేజ్ స్టార్ట‌య్యింది. విడుద‌లయ్యిన మెద‌టి లుక్ కి విప‌రీత‌మైన క్రేజ్ రావ‌టం తెలిసిందే అయితే సుధీర్ బాబు పుట్టిన‌రోజు సంద‌ర్బంగా శ్రీదేవి సోడా సెంట‌ర్ చిత్రానికి సంబందించి గ్లింప్స్ విడుద‌ల చేశారు. ఈ గ్లింప్స్ విడ‌ద‌ల‌య్యి అవ్వ‌గానే సోష‌ల్ మీడియా లో ట్రెండ్ అవ్వ‌టం ఈ చిత్రంపై అభిమానుల‌, ప్రేక్ష‌కుల అంచ‌నాలు ఏరేంజి లో వున్నాయో తెలియ‌జేస్తుంది. ఈ చిత్రాన్ని భ‌లేమంచిరోజు, ఆనందో బ్ర‌హ్మ‌, యాత్ర లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హ్య‌ట్రిక్ చిత్రాలు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ లో నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రానికి 1978 ప‌లాస చిత్రం ద్వారా బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవిని ట్రెండింగ్ సాంగ్ ని టాలీవుడ్ కి అందించిన క‌రుణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌- సుదీర్‌బాబు కాంబినేష‌న్‌

భ‌లేమంచిరోజు చిత్రం తో సుధీర్‌బాబు హీరోగా 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మొద‌ల‌య్యి మొద‌టి ప్ర‌య‌త్న‌మే సూప‌ర్‌హిట్ గా నిలిచింది. ఆ త‌రువాత ఈ బ్యాన‌ర్ లో తాప్సి మెయిన్ లీడ్ లో ఆనందో బ్ర‌హ్మ చిత్రాన్ని నిర్మించారు. మ‌నుషుల్ని చూసి దెయ్యాలు భ‌య‌డ‌టం అనే వినూత్న‌మైన పాయింట్ తో ఆద్యంతం న‌వ్యించి విజ‌యాన్ని సాధించారు. ఈ బ్యాన‌ర్ లో హ్య‌ట్రిక్ చిత్రంగా మ‌ళ‌యాలం సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి మెయిన్ లీడ్ లో యాత్ర చిత్రాన్ని నిర్మించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు పోందారు. బిగ్‌బ్లాక్‌బ‌స్ట‌ర్ పోందారు. హ్యాట్రిక్ స‌క్స‌స్ చిత్రాల త‌రువాత సుధీర్‌బాబు కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంట‌ర్‌. ఈ చిత్రానికి సంభందించి గ్లింప్స్ అంద‌ర్ని విప‌రీతం గా ఆక‌ట్టుకొవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ గా నిల‌వ‌టం విశేషం. 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ కి సుధీర్‌బాబు కాంబినేష‌న్ అన‌గానే ట్రేడ్ లో క్రేజ్ రెట్టింప‌య్యింది.

70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌-సుదీర్‌బాబు-క‌రుణ‌కుమార్ కాంబినేష‌న్‌

70ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సుధీర్‌బాబు కాంబినేష‌న్ కి వున్న క్రేజ్ కి మ‌రో సూప‌ర్ ప‌వ‌ర్ ద‌ర్శ‌కుడు క‌రుణ‌కుమార్ శ్రీదేవి సోడా సెంట‌ర్ ద్వారా యాడ్ అయ్యారు. 1978 ప‌లాస అనే చిత్రం గ‌త సంవ‌త్స‌రం మార్చి లో విడుల‌య్యింది. ఈ చిత్రం ప్ర‌ముఖుల , పాత్రికేయుల ప్ర‌శంశ‌లు విడుద‌ల‌కి ముందుగానే పొందింది. విడుద‌ల త‌రువాత ప్రేక్ష‌కుల నీరాజ‌నాలు ప‌లికారు. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు విజ‌న్ ని అభినందించారు. అలాగే ఈ చిత్రంల ఓ సాంగ్ లాక్‌డౌన్ లో తెలుగు ప్ర‌జ‌ల‌కి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అవ్వ‌టం, అది చాలా పెద్ద సంచ‌ల‌నం నిల‌వ‌టం విశేషం. అలాంటి మ‌రో సంచ‌ల‌న‌మైన సాంగ్ ని ఈ చిత్రం ద్వారా కూడా ఇవ్వ‌నున్నారు. ఈరోజు విడుద‌లయ్యిన గ్లింప్స్ లో ప్ర‌తిషాట్ లో ద‌ర్శ‌కుడు విజ‌న్ క్లియర్ గా క‌నిస్తుంది. సుధీర్‌బాబు ని కొత్త కొణం లో లైటింగ్ సూరిబాబు గా చూపించారు. ఈ చిత్రంలోని పాత్ర‌ల‌న్నికొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

పుట్టిన‌రోజు సంద‌ర్బంగా శ్రీదేవి సోడా సెంట‌ర్ గ్లింప్స్‌

సుధీర్‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్బంగా గ్లింప్స్ విడుద‌ల చేశారు. ఈ గ్లింప్స్ లో మెద‌ట గోదావ‌రి లో బోట్స్ ని చూపించారు. ష‌ర్ట్ లేకుండా లైటింగ్ సూరిబాబు బోట్ ని న‌డ‌ప‌డం, లైటింగ్ కొట్ట‌డం, రౌడీల్ని కొట్ట‌డం, త‌రువాత గోదావ‌రి లోనుండి సిక్స్‌ప్యాక్ బాడీతో బోట్ ఎక్క‌డం లాంటి విజువ‌ల్స్ మ‌న కళ్ళ‌ని ఎటూ తిప్పుకోనివ్వ‌వు. ఆ విజువ‌ల్స్ చూస్తున్నంత‌సేపు సుధీర్‌బాబు ఎక్క‌డా క‌నిపించ‌డు లైటింగ్ సూరిబాబు మాత్ర‌మే క‌నిపిస్తాడు. శ్యామ్ ద‌త్ కెమెరా విజువ‌ల్స్‌, మ‌ణిశ‌ర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్ట‌కుంటుంది.

బ్యానర్ – 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు – విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
దర్శకత్వం – కరుణకుమార్
సంగీతం – మణిశర్మ
సినిమాటోగ్రఫి – శ్యాందత్ సైనుద్డీన్
ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్ – రామకృష్ణ, మౌనిక
కథ – నాగేంద్ర కాశీ
కొరియోగ్రఫి – ప్రేమ్ రక్షిత్, విజయ్ ప్రకాష్, యశ్వంత్
యాక్షన్ – డ్రాగన్ ప్రకాష్, బొబ్బిలి రాజా(నిఖిల్), రియల్ సతీష్
లిరిక్స్ – సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కళ్యాణ చక్రవర్తి, కాసర్ల శ్యామ్
సౌండ్ డిసైనర్ – సింక్ సినిమా
ఆడియోగ్రఫి – కన్నన్ గన్పత్
పబ్లిసిటీ డిసైనర్ – అనంత్ (పద్మశ్రీ ఆర్ట్స్)
పిఆర్ ఓ – ఏలూరు శ్రీను, మేఘశ్యామ్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES