HomeTeluguఎ7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ర‌క్క‌సి చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం!

ఎ7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ర‌క్క‌సి చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం!


ఎ7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నూత‌న క‌థానాయ‌కుల‌తో ఈ రోజు అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ర‌క్క‌సీ చిత్రం ఘ‌నంగా ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ఈ చిత్రానికి సాగ‌ర్ క్లాప్ కొట్ట‌గా ప్ర‌ముఖ నిర్మాత ప్ర‌శ‌న్న‌కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. వీర‌శంక‌ర్ ఈ చిత్రానికి గౌర‌వ‌ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాయా మాట్లాడుతూ
ఎ 7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో మాది మొద‌టి చిత్రం. ద‌ర్శ‌కుడు అభిఅన్న‌య్య నా మేన‌ల్లుడు. నేను అత‌నిలోని టాలెంట్ ని గుర్తించి ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకు వ‌చ్చాను. మా చిత్రానికి మీ అంద‌రి ఆద‌రాభిమానాలు కావాలి. మా చిత్రంలో ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరున నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

నిర్మాత ప్ర‌భ నాయుడు మాట్లాడుతూ
ఎ7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో మాది మొద‌టి చిత్రం. మీరంద‌రి స‌పోర్ట్ త‌ప్ప‌కుండా మా చిత్రానికి ఉండాల‌ని కోరుకుంటున్నాను. ర‌క్క‌సి అంటే ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. డ్ర‌గ్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్ర క‌థాంశం ఉండ‌బోతుంది. త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను ఎట్లాంటి వాతావ‌ర‌ణంలో పెంచుతున్నారు అన్న కాన్సెప్ట్ మీద ఉంటుంది. మా మూవీలో ఇంకా ఎంతో మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. త‌రువాత మేము నిధాన‌ముగా ఒకొక్క‌టి రివీల్ చెయ్యాల‌నుకుంటున్నాము అన్నారు.

హీరో విక్కీ మాట్లాడుతూ
నేను ఒక డెబ్యూ హీరో. మా డైరెక్ట‌ర్‌ అన్న‌య అభి, డిఒపి జ‌గ‌న్‌, హీరోయిన్ సిమ్ర‌త్‌. మేమంతా ఈ చిత్రం కోసం ముందు ముందు బాగా క‌ష్ట‌ప‌డి మంచి అవుట్ పుట్ తీసుకువ‌స్తామ‌ని అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ షకీల్ మాట్లాడుతూ
ఈ చిత్రం డ్ర‌గ్స్ బేస్డ్ మూవీ. ఈ చిత్రాన్ని ఎక్క‌డా కాంప్ర‌మైజ్ అవ్వ‌కుండా నిర్మాత‌లు చాలా బాగా తీశారు. ఈ సినిమా అంతా థ్రిల్లింగ్ గా ఒన్ మూవీ లా ఉంటుంది. నా గ‌త చిత్రాల‌న్నీ కూడా ఎలాగైతే మ్యూజిక్ వ‌చ్చిందో ఇది కూడా అంతే. మంచి సినిమాకు సంగీతం చెయ్యడం సంతోషంగా ఉందన్నారు.

హీరోయిన్ సిమ్ర‌త్ మాట్లాడుతూ...
నేను 2019 మిస్ ఇండియాగా సెలెక్ట్ అయ్యాను. నేను తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నాది బాంబే. ఈ మూవీ కోసం ఇంకా చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంది. మా సినిమాని మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను. మ‌మ్మ‌ల్సి ఎంకరేజ్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.

ద‌ర్శ‌కుడు అభి అన్న‌య్య మాట్లాడుతూ
ముందుగా న‌న్ను న‌మ్మి నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినందుకు నిర్మాత‌ల‌కు నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. మా సినిమాలో ఇంకా చాలా మంది పెద్ద యాక్ట‌ర్స్ ఉన్నారు. మేము నిధానంగా పోస్ట‌ర్ రూపంలో ఒకొక్క‌రిని రివీల్ చెయ్యాల‌నుకుంటున్నాము. ఇందులో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫైట్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ ని పెట్టాల‌ని చూస్తున్నాము అన్నారు.

హీరో: విక్కీ హీరోయిన్: సిమ్రతి భాటియ, ప్రజక్త దుసన

బ్యానర్: ఏ7 పిక్చర్స్
డైరెక్టర్: అన్నయ్య అభి రాజు
నిర్మాత: ప్రభ నాయుడు, మాయా మీనన్
కెమెరామెన్: జగన్.ఏ
సంగీతం: ఆర్.ఆర్.షకీల్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
స్టంట్స్: సుబ్బు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉదయ్ చౌదరి నలిపినేని
కో.డైరెక్టర్: రాజా మోహన్
లైన్ ప్రొడ్యూసర్: దినేష్ రెడ్డి అల్లా, శివ మల్లల

Eluru Sreenu
P.R.O

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES