HomeTelugu'అమ్మ‌దీవెన' చిత్రాన్ని అమ్మలందరికీ అంకితమిస్తున్నాం- నిర్మాతలు

‘అమ్మ‌దీవెన’ చిత్రాన్ని అమ్మలందరికీ అంకితమిస్తున్నాం- నిర్మాతలు

మదర్ సెంటిమెంట్ తో వచ్చిన అమ్మ రాజీనామా, మాతృదేవోభవ, యమలీల, రీసెంట్ గా బిచ్చగాడు వంటి చిత్రాలు సూపర్ హిట్స్ అయిన విషయం తెలిసిందే..! ఇప్పుడు అదే కోవలో తల్లి గొప్పదనాన్ని చాటి చెప్పేవిధంగా వస్తోన్న చిత్రం “అమ్మదీవెన”. ప్రముఖ హీరోయిన్ ఆమని ముఖ్యపాత్రలో శ్రీమతి లక్ష్మీ స‌మ‌ర్ప‌కురాలిగా ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై శివ ఏటూరి దర్శకత్వంలో ఎత్తరి మారయ్య, ఎత్తరి చిన‌మార‌య్య‌, ఎత్తరి గుర‌వ‌య్య సంయుక్తంగా “అమ్మ దీవెన” చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జనవరి 29న థియేటర్స్ లలో విడుదల కానుంది.

నిర్మాతలు ఎత్తరి మారయ్య, ఎత్తరి చినమారయ్య, ఎత్తరి గురవయ్యలు మాట్లాడుతూ.. ‘ ఆడియెన్స్ అందరూ కలిసి చూసే విధంగా ‘అమ్మదీవెన’ చిత్రం ఉంటుంది. ఒక మంచి పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ఆమని నటించింది. అమ్మగా తన నటనతో విజృంబించింది. ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యూత్ ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. మనోహర్ విజువల్స్, వెంకట్ అజ్మీర మ్యూజిక్ మా సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి. మంచి సినిమా తీశామనే సంతృప్తి గా ఉన్నాం. జనవరి 29న థియేటర్లలో సినిమాని విడుదల చేస్తున్నాం. పోసాని గారు పాత్ర బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన అన్ని సినిమాలు ప్రజాదరణ పొందాయి. అలాగే మా చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అమ్మదీవెన చిత్రాన్ని అమ్మలందరికీ అంకితమిస్తున్నాం.. ప్రేక్షకులందరూ ఈ సినిమాని చూసి పెద్ద సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నాం.. అన్నారు.

ఆమని, పోసాని, నటరాజ్, శ్రీ పల్లవి, శరణ్య, సత్యప్రకాష్, శృతి, డి ఎస్ రావు, యశ్వంత్ నాని యాదవ్, కావ్య, అరుణ్ నటిస్తున్న ఈ చిత్రానికి

దర్శకత్వం: శివ ఏటూరి,
నిర్మాతలు : ఎత్తరి మారయ్య, ఎత్తరి చిన‌మార‌య్య‌, ఎత్తరి గుర‌వ‌య్య,
మాటలు : శ్రీను. బి,
సంగీతం : వెంకట్ అజ్మీర
డి ఓ పి : సిద్ధం మనోహర్,
ఎడిటర్ : జానకి రామ్
డాన్సులు : గణేష్ స్వామి, నాగరాజు, చిరంజీవి,
ఫైట్స్ : నందు,

పి.ఆర్ఓ. : సాయి సతీష్. రాంబాబు పర్వతనేని.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES