HomeTeluguటాకీ పార్ట్ పూర్తి చేసుకున్న "సాథి"

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న “సాథి”


ప్రస్తుతం ఇండస్ట్రీలో యువ దర్శకుల హావా నడుస్తోంది. కొత్త ఐడియాస్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు తెరకెక్కిస్తూ… ముందుకు దూసుకుపోతున్నారు. అలా ఎంతో మంది టాలెంటెడ్ దర్శకులు హిట్ కొట్టాలన్న కసితో విభిన్న తరహా చిత్రాలను రూపొందిస్తూ సక్సెస్ లు సాధిస్తున్నారు. ఆకోవలోనే రాజ్ కార్తీకేన్ “సాథి” వంటి డిఫరెంట్ టైటిల్ తో ఒక సినిమాని తెరకెక్కించారు. భార్గవి క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది.. బస్టాప్, గ్రీన్ సిగ్నల్, అత్తారిల్లు, ఇక సే లవ్ చిత్రాల్లో హీరోగా నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి రవికుమార్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సోనియా, చంద్రిక, రాజ్ కార్తికేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలో రిలీజ్ కానుంది. కాగా డిసెంబర్ 9న దర్శకుడు రాజ్ కార్తికేన్ పుట్టినరోజు. ఈ సందర్బంగా సాథి పోగ్రెస్ ను తెలిపారు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ఎన్నో చిత్రాలు వస్తున్నాయి. అందులో కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. మా సాథి చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుందని, యూత్ ఆడియెన్స్ ని డిజప్పాయింట్ చేయదని గ్యారెంటీగా చెప్పగలను. దర్శకుడిగా ఈ చిత్రం నాకు మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తుందని ఆశిస్తున్నాను..టాకీ పార్ట్ కంప్లీట్ అయిన ఈ చిత్ర విశేషాలను త్వరలో తెలియజేస్తాం.. అన్నారు.

సాయి రవికుమార్, సోనియా, చంద్రిక, రాజ్ కార్తికేన్, ప్రియా పౌల్, అస్మిత, మధుమని, శ్రీలక్ష్మి, మాస్టర్ జాయ్, జబర్దస్త్ ఫణి, జబర్దస్త్ రాము, డిఎంకె తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:మహిత్ నారాయణ్, కెమెరా:ఎస్.ఎస్.వి.ప్రసాద్, ఎడిటర్:ఉదయ్ రచన-దర్శకత్వం:రాజ్ కార్తికేన్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES