నాగశౌర్య హీరోగా ‘ఛలో’, ‘అశ్వథ్థామ’ లాంటి సూపర్ హిట్ సినిమాల్ని నిర్మించిన ఐరా క్రియేషన్స్ సంస్థ నుంచి సోదర సంస్థగా ఐరా సినిమాస్ ప్రారంభమైంది. ఔత్సాహిక నటులు, దర్శకులతో కంటెంట్ ప్రధాన చిత్రాలను నిర్మించడం ఐరా సినిమాస్ ఏర్పాటులోని ఉద్దేశం. చిత్రసీమలోకి అడుగుపెట్టాలని కలలు కనే నూతన నటులు, దర్శకులకు ఇది మంచి అవకాశం.
హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఐరా సినిమాస్ నిర్మిస్తోన్న తొలి చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. సన్నీ కొమాలపాటి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి నటుడు, వ్యాపారవేత్త, ఏఎస్‌పీ మీడియా హౌస్ అధినేత అభినవ్ సర్దార్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. నవంబర్ 9 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉషా శంకర్‌ప్రసాద్ ముల్పూరి మాట్లాడుతూ, “ఇవాళ మంచిరోజు కావడంతో పూజా కార్యక్రమాలు నిర్వహించాం. ఐరా సినిమాస్ అనేది ఐరా క్రియేషన్స్‌కు సోదర సంస్థ. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో బ్యానర్‌ను ప్రారంభించాం. ఫ్రెష్ కంటెంట్‌తో బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్‌ను ఈ బ్యానర్‌పై నిర్మిస్తాం. సన్నీ కొమాలపాటి దర్శకత్వంలో మేం నిర్మిస్తున్న తొలి చిత్రం ఓ థ్రిల్లర్” అని చెప్పారు.
త్వరలో ఈ చిత్రానికి పనిచేసే తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు.
దర్శకుడు: సన్నీ కొమాలపాటి
నిర్మాత: ఉషా శంకర్‌ప్రసాద్ ముల్పూరి
సహ నిర్మాత: అభినవ్ సర్దార్
సమర్పణ: బుజ్జి
బ్యానర్స్: ఐరా సినిమాస్, ఏఎస్‌పీ మీడియా హౌస్
Ira Cinemas Production No 1 Film Launched
Made few super hit films like Chalo and Aswathama with Naga Shaurya, Ira Creations has now floated a sister banner called ‘Ira Cinemas’. The intention of floating sister production is to make content-rich films with aspiring actors and directors.
It will be a great opportunity for budding actors and directors who have been dreaming to make their film debut. Ira Cinemas’ first film opening ceremony happened today at office in Hyderabad. Sunny Komalapati will direct, while actor and entrepreneur Abhinav Sardhar of ASP Media House will co-produce the film that will start rolling from November 9th.
While speaking on the occasion, producer Usha Shankar Prasad Mulpuri said, “Given it’s a propitious day, the Pooja ceremony is held today. Ira Cinemas is a sister company to Ira Creations and it is started to encourage young talent. We will be making back to back films with fresh content. The first film with Sunny Komalapati is a thriller.”
Other cast and crew of the film will be announced soon.
Director: Sunny Komalapati
Producer: Usha Shankar Prasad Mulpuri
Co-Producer: Abhinav Sardhar
Presents: Bujji
Banners: Ira Cinemas, ASP Media House