HomeTeluguఉత్త‌ర ట్రైల‌ర్ లాంచ్

ఉత్త‌ర ట్రైల‌ర్ లాంచ్

లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన మూవీ ‘ఉత్తర’. శ్రీరామ్, కారుణ్య కత్రేన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈమూవీ కి దర్శకుడు తిరుపతి యస్ ఆర్. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మరో అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా జరిగింది. రోమాంటిక్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఉత్తర ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలలో ఉంది

లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన మూవీ ‘ఉత్తర’. శ్రీరామ్, కారుణ్య కత్రేన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈమూవీ కి దర్శకుడు తిరుపతి యస్ ఆర్. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మరో అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా జరిగింది. రోమాంటిక్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఉత్తర ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలలో ఉంది. కొత్త బ్యాక్ డ్రాప్ లు, యాసలు తెలుగు సినిమాకి కొత్త లుక్ ని తెస్తున్నాయి. ఉత్తర కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేవి నిజాయితీగా కనిపించే పాత్రలు, సహాజత్వం నింపుకున్న కథనం. ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ లను అందిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అతిథులు, చిత్రయూనిట్ మాట్లాడుతూ:

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ: ‘ ఈ సినిమా ట్రైలర్ లో నన్ను ఎక్కువుగా ఆకర్షించింది మ్యూజిక్. సురేష్ బొబ్బిలి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. బ్యాక్ డ్రాప్ యెక్క ఆత్మ ను సంగీతంతో పలికించే ప్రయత్నం చేసే మ్యూజిక్ దర్శకులలో సురేష్ బొబ్బిలి ఒకరు. అలాగే దర్శకుడు నాకు కథ చెప్పినప్పుడు ఇలాంటి క్రైం బ్యాక్ డ్రాప్ కథలు చాలా వచ్చాయి, ఇందులో ఏం కొత్తదనం ఉంటుంది అనుకున్నాను. కానీ ట్రైలర్ చూస్తే లుక్ అండ్ ఫీల్ చాలా ప్రెష్ గా ఉన్నాయి. తెలంగాణా యాస తెరపై గమ్మత్తును చేస్తుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు తిరుపతికి మంచి విజయం తో పాటు రెస్సెక్ట్ వస్తుందని నమ్ముతున్నాను ’ అన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ: ‘ ఈసినిమా బ్యాక్ డ్రాప్ బాగుంది. కొత్త ఫీల్ కలిగింది. స్టార్స్ తో సంబంధం లేకుండా కంటెంట్ బాగున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ బాగుంది. ఈ సినిమా సపోర్ట్ చేస్తున్న వ్యక్తులను చూస్తే ఈ సినిమా పై మరింత నమ్మకం కలుగుతుంది. ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ కి ఇండస్ట్రీ లో ఎప్పటికీ స్థానం ఉంటుంది. ’ అన్నారు.

ప్రొడ్యూసర్ శ్రీపతి గంగదాస్ మాట్లాడతూ: ‘ సినిమా ఇండస్ట్రీ లో కొత్తవాళ్ళను ప్రొత్సహించడానికి వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరికి, తమ్మారెడ్డి భరద్వాజ గారికి ధన్యవాదాలు. ఉత్తర సినిమా ఇంత బాగా రావడానికి కారణం అయిన టెక్నీషన్స్ కి ఆర్టిస్ట్ లకు థాంక్స్. తిరుపతి సినిమా ను బాగా తెరకెక్కించారు. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను’ అన్నారు.

మామిడి హారికృష్ణ మాట్లాడుతూ: ‘ సినిమా ఇండస్ట్రీలో కలలను సాకారం చేసుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఈ ఉత్తర సినిమా పేపర్ పై కథగా ఉన్నప్పటి నుండి నాకు తెలుసు. దర్శకుడు తిరుపతి పడ్డ కష్టం తెలుసు. ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే సినిమా పై నమ్మకం మరింత పెరిగింది. ఇందులో పనిచేసిన టీం అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సురేష్ బొబ్బిలి అందించిన మ్యూజిక్ ఉత్తర కి ప్రధాన ఆకర్షణగా మారింది. అలాగే లీడ్ రోల్స్ చేసిన శ్రీరామ్, కారుణ్య ల నటన ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది ’ అన్నారు.

హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ: ‘ ఏ సినిమలో అయినా కొత్తదనం ఉంటే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులలోనూ ఆదరణ దొరుకుంతుంది. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కొత్తదనం నిండిన సినిమాలను ప్రొత్సహించిన వారే. మా సినిమా కూడా అలాంటి కొత్తదనం తోనే వస్తుంది. ఈ సినిమాలో నన్న సెలెక్ట్ చేసిన దర్శకుడికి నేను ఎప్పుడూ రుణ పడి ఉంటాను. ఈ టీం అందరూ నన్ను బాగా ఎంకేరేజ్ చేసారు. అలాగే కారుణ్య నటన ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ’ అన్నారు.

హీరోయిన్ కారుణ్య కత్రేన్ మాట్లాడుతూ: ‘ ఈ సినిమా గురించి చెప్పాలంటే దర్శకుడే సినిమా, సినిమానే దర్శకుడు. ఆయన అంతగా ఈసినిమాకోసం పనిచేసారు. ఈ టీంతో వర్క్ చేయడం చాలాసంతోషంగా ఉంది. నా పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం నాకుంది. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి, రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యావాదాలు అన్నారు.

దర్శకుడు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ మాట్లాడుతూ: ‘ఉత్తర సినిమా కథ నాకు తెలుసు, కొత్తదనం, సహాజత్వం నిండిన కథ, హిందీ సినిమా టుంబాద్ తరహాలో సాగే కథలా అనిపించింది. దర్శకుడు తిరుపతి ఈ సినిమా కి మంచి ట్రీట్ మెంట్ ని ఇచ్చాడు. కొత్త తరహా కథా, కథనాలకు ప్రోత్సాహం తప్పకుండా దొరుకుతుంది. ఉత్తర సినిమాకు ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. సంతోష్ నారాయణ రేంజ్ ఉన్న సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి. ఈ సినిమాకి ఆయన అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది. ’ అన్నారు.

దర్శకుడు తిరుపతి యస్ ఆర్ మాట్లాడుతూ: ‘ ఈ సినిమా లో పాత్రలు చాలా సహాజంగా ఉంటాయి. సినిమా చూసిన తర్వాత ఆ ఫీల్ మిమ్మల్ని కొన్ని రోజులు వెంటాడుతుంది. ఉత్తర సినిమాలో కనిపించే ప్రతి సన్నివేశంతో ప్రేక్షకులు రిలేట్ అవుతారు. ఈ సినిమాలో వర్క్ చేసిన హీరోయిన్ కారుణ్య, శ్రీరామ్ ల పాత్రలకు మంచి పేరు వస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏదో ఒక లైన్ ని డెవలెప్ చేసిన కథ కాదు. కథా, కథనాలలోనే ప్రేక్షకులను కట్టివేసే అంశాలుంటాయి. ఈ ట్రైలర్ లాంచ్ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి, రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యావాదాలు’ అన్నారు.

బ్యానర్స్: లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్స్. సినిమాటోగ్రఫీ: చరణ్ బాబు,మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి,ఎడిటర్: బొంతుల నాగేశ్వర రెడ్డి,రైటర్: ఎన్. శివ కల్యాణ్,రచన మరియు దర్శకత్వం : తిరుపతి యస్ ఆర్,ప్రొడ్యూసర్స్ : తిరుపతి యస్ ఆర్. శ్రీపతి గంగదాస్.

నటీ నటలు: శ్రీరామ్ నిమ్మల, కారుణ్య కత్రేన్, అజయ్ ఘోష్, వేణు, అభినవ్, అభయ్ తదితరులు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES