HomeTeluguమార్చ్ 25న వస్తోన్న ముప్పైరోజుల్లో ప్రేమించడం ఎలా?

మార్చ్ 25న వస్తోన్న ముప్పైరోజుల్లో ప్రేమించడం ఎలా?

కర్ ప్రదీప్ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా మున్నా దర్శకత్వంలో యస్. వి.బాబు నిర్మించిన ముప్పైరోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రం మార్చ్ 25న విడుదలవుతుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ..

కో-ప్రొడ్యూసర్ వినయ్ మాట్లాడుతూ.. ముప్పైరోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం మార్చ్ 25న విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి హిట్ అయ్యాయి. అలాగే సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఈ సినిమాకి పనిచేసిన నటీ,నటులకు నా థాంక్స్ అన్నారు.

నిర్మాత యస్.వి. బాబు మాట్లాడుతూ.. నీలి నీలి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనూప్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే చంద్రబోస్ మంచి సాహిత్యాన్ని అందించారు. బన్నీ వాసు సినిమా చూశారు. ఆయనకి బాగా నచ్చి జిఎ2 బ్యానర్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. బన్నీ వాసుకి నా థాంక్స్… అన్నారు.

దర్శకుడు మున్నా మాట్లాడుతూ.. యం సి ఏ చదివే రోజుల్లో సుకుమార్ వద్ద పనిచేయాలను గట్టిగా అనుకున్నాను. అలాగే సుకుమార్ గారి వద్ద అసిస్టెంట్ గావర్క్ చేశాను. ఈ కథ అల్లు అర్జున్ గారికి, బన్నీ వాసుకి చెప్పాను. ఆయన బాగా ఎంజాయ్ చేస్తూ కొన్ని సజేషన్స్ ఇచ్చారు. ఆయన చెప్పినట్టు చేశాం. సెన్సార్ వారు సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. అలాగే బన్నీ వాసు సినిమా చూసి జీఎ2 ద్వారా రిలీజ్ చేస్తున్నారు. వారికి నా థాంక్స్. ఈ చిత్రంలోని కొన్ని ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 2020లో ఒక గుర్తుండిపోయే సినిమా అవుతుంది.. అన్నారు.

 ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ.. నీలి నీలి పాటకు ఇప్పటికే 70మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఇంకా 100 మిలియన్స్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఇండస్ట్రీలో హీరోలు మహేష్, రాణా హీరోయిన్స్ కాజల్, తమన్నా అందరూ మా సినిమాని సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మున్నా మంచి కథ ఇవ్వడమే కాకుండా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాకి మంచి టీమ్ కుదిరింది. మంచి మనుషులు అందరూ కలిసి చేసిన ఈ చిత్రం తప్పకుండా హిట్ అవుతుంది. బన్నీ వాసు గారు సినిమా చూసి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మార్చ్ 25న ఈ చిత్రాన్ని జిఏ2, యువి క్రియేషన్స్ రెండు పెద్ద బ్యానర్లు ద్వారా గ్రాండ్ గా విడుదలవుతుంది. బాబు గారు చిన్న సినిమాలా కాకుండా పెద్ద సినిమా స్థాయిలో నిర్మించారు. ఈ సినిమాకి వర్క్ చేసిన అందరికి థాంక్స్.. అన్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES