HomeTeluguఅలీ హీరోగా రూపొందుతున్న ‘మా గంగానది’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

అలీ హీరోగా రూపొందుతున్న ‘మా గంగానది’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ర‌వికుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో మూగాంబికా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.బాల నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వి.నాగేశ్వ‌ర‌రావు, సూర్య‌వంత‌రం, ఎం.ఎన్‌.యు.సుధాక‌ర్ నిర్మిస్తోన్న చిత్రం ‘మా గంగానది’. ‘అంత ప్ర‌విత్ర‌మైనది స్త్రీ’ అనేది ఉప‌శీర్షిక‌. అలీ, నియా హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో అలీ కుమార్తె బేబీ జువేరియా న‌టించ‌డం విశేషం. మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మియాపూర్‌లోని పీఎస్ఎస్ మ‌హిళా ట్రస్ట్‌లో చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర హీరో అలీ, డైరెక్ట‌ర్ వి.బాల నాగేశ్వ‌ర‌రావు, పీఎస్ఎస్ నిర్వాహ‌కుడు డా.హెచ్‌.సి.శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా…

హీరో అలీ మాట్లాడుతూ ‘‘శ్రీనివాస్‌గారు, ఆయ‌న శ్రీమ‌తిగారు మంచి ఆశ‌యంతో ఈ ట్ర‌స్ట్‌ను న‌డిపిస్తున్నారు. డ‌బ్బు చాలా మంది ద‌గ్గ‌ర ఉండొచ్చు కానీ.. ప‌దిమందికి సాయ‌పడాల‌నే గుణం కొంత మంది ద‌గ్గ‌రే ఉంటుంది. ఆ మ‌న‌సు శ్రీనివాస్‌గారు, ఆయ‌న శ్రీమ‌తిగారికి ఆ భ‌గ‌వంతుడు ఇచ్చారు. ఇక్క‌డున్న అంద‌రినీ త‌మ పిల్ల‌లుగా భావిస్తున్నారు. కాబట్టి ఇక్క‌డున్న ప్ర‌తి ఒక్క‌రూ చ‌క్క‌గా చ‌దువుకుని వృద్ధిలోకి రావాల‌ని కోరుకుంటున్నాను. భ‌విష్య‌త్తులో ఏదైనా అవ‌స‌రం అయితే నా ట్ర‌స్టు ద్వారా సాయం అందిస్తాన‌ని శ్రీనివాస్‌గారికి ఈ సంద‌ర్బంగా తెలియ‌జేస్తున్నాను. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే..ఈ సినిమా నాది 1109వ సినిమా. ఈ ముగాంభికా బ్యాన‌ర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం ‘మా గంగానది’ అనే సినిమాను నిర్మించారు. భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలపై అద్భుతమైన కథ. బాల నాగేశ్వరరావుగారు అద్భుతమైన వ్యక్తి. బాగా చదువుకున్నారు. సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తి. స్త్రీలకు సంబంధించిన కథతో రూపొందించారు’’ అన్నారు.

డైరెక్టర్ వి.బాల నాగేశ్వరరావు మాట్లాడుతూ – ‘‘ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ముఖ్యంగా స్త్రీ సమస్యలపై రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రంలో అలీగారి చిన్న కుమార్తె జువేరియా కూడా న‌టించ‌డం విశేషం. తప్పకుండా ఈ సినిమాను ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

న‌టీన‌టులు:
అలీ
నియా
బేబీ జువేరియా త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
కెమెరా: ప‌్ర‌వీణ్ వ‌న‌మాలి
సంగీతం: సునీల్ క‌శ్య‌ప్‌
ఎడిటింగ్‌: ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌
నిర్మాత‌లు: వి.నాగేశ్వ‌ర‌రావు, సూర్య‌వంత‌రం, ఎం.ఎన్‌.యు.సుధాక‌ర్
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: వి.బాల‌నాగేశ్వ‌ర‌రావు

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES