‘రణరంగం’ ఆగస్టు 15 న విడుదల

Ranarangam to release on Independence Day

473

‘శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని’ ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం ‘రణరంగం’ ఆగస్టు 15 న విడుదల యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’ ఆగస్టు 15 న విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.

చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..’రణరంగం’ చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేయాలని నిర్ణయించాము. చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు సుధీర్ వర్మ ‘రణరంగం’ ను తెరకెక్కించిన తీరు ఎంతో ప్రశంసనీయం. అన్ని వర్గాలవారిని ఈచిత్రం అలరిస్తుంది. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియ పరుస్తామని అన్నారు.

తెలుగు చలన చిత్రపరిశ్రమలోని ప్రతిభావంతమైన నటుల్లో హీరో శర్వానంద్ ఒకరు. ‘గ్యాంగ్ స్టర్’ గా ఈ చిత్రం లో శర్వానంద్ పోషిస్తున్న పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నం గా ఉండటమే కాకుండా, ఎంతో వైవిద్యంగానూ, ఎమోషన్స్ తో కూడినదై ఉంటుంది. ‘గ్యాంగ్ స్టర్’ అయిన చిత్ర కథానాయకుని జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’.భిన్నమైన భావోద్వేగాలు,కధ, కధనాలు ఈ చిత్రం సొంతం. మా హీరో శర్వానంద్ ‘గ్యాంగ్ స్టర్’ పాత్రలో చక్కని ప్రతిభ కనబరిచారు. చిత్రం పై మాకెంతో నమ్మకం ఉంది. ప్రేక్షకులు కూడా ఈ నూతన ‘గ్యాంగ్ స్టర్’ చిత్రాన్ని ఆదరిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్. నిర్మాత: సూర్యదేవర నాగవంశీ రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ