కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ గౌతమ్‌వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎన్నై నోకి పాయమ్ తోట. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ముగిసాయి. యు ఏ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రాన్ని తెలుగులో `తూటా` పేరుతో గొలుగూరి రామకృష్ణా రెడ్డి సమర్పణలో విజయభేరి వారి బ్యానర్‌పై జి. తాతారెడ్డి , జి సత్యానారాయణరెడ్డి జనవరి 1న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత తాతారెడ్డి విలేకరులతో మాట్లాడారు ఆ విశేషాలు…
మీ నేపథ్యం?
యూఎస్‌లో ఎమ్ఎస్ బయో టెక్నాలజీ చేశాను. క్యాన్సర్ రీసెర్చ్‌లో సెంటిస్ట్‌గా రెండు సంవత్సరాలు పని చేశాను. తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చిఅల్లు అర్జున్ గారి `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`, సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాను. తరువాత `లవర్స్ డే` చిత్రాన్ని పంపిణీ చేశాను. ఇప్పడు తెలుగులో గౌతమ్ మీనన్ గారి `తూటా` సినిమాతో తో నిర్మాతగా మీ ముందుకు వస్తున్నాం.
తూటా గురించి చెప్పండి?.
గౌతమ్‌మీనన్ గారు ఇదివరకు చాలా ప్రేమకథా చిత్రాలు చేశారు. అయితే `తూటా` చిత్రం వాటికి విభిన్నంగా ఉండి ప్రేక్షకులను మరింత మెప్పిస్తుంది. మాతృకలో చాలా మార్పులు చేసి తెలుగు నెటివిటీ కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. సినిమా నిడివి తగ్గించడంతో స్క్రీన్ ప్లే రేసీగా ఉండి ప్రేక్షకులకు కథపై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఒక ఫ్యామిలీ ట్రాక్‌కు కొత్తగా అండర్‌వరల్డ్ టచ్ ఉంటుంది. జనరల్‌గా గౌతమ్‌మీనన్‌గారి సినిమాలు అంటే రొమాంటిక్‌గా ఉంటూ క్లైమాక్స్‌లో యాక్షన్ ఉంటుంది. కానీ తూటా సినిమాలో 70 పర్సెంట్ యాక్షన్ ఉంటుంది. అందుకే `తూటా` అనే టైటిల్ పెట్టాం.
సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిస్తుంది?
`తూటా` చూస్తున్నప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అందరి పాత్రలు బాగా సూట్ అయ్యాయి. ఏదైనా ఆల్బమ్‌లో ఒకటి లేదా రెండు పాటలు బాగుంటాయి. కానీ ఈ సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చాయి. ప్రతిపాట సందర్భానుసారంగానే వస్తుంది. సిద్ శ్రీరామ్ గారు పాడిన రెండు పాటలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
బిజినెస్ ఎలా జరిగింది?
నైజాంలో ఎషియన్ సునీల్‌గారు, సీడెడ్ ఎన్వీ ప్రసాద్‌గారు ఇలా ఈస్ట్ వెస్ట్ కూడా ప్రముఖ పంపిణీదారులే మా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 2015 జనవరి 1న ఇదే బ్యానర్ లో వచ్చిన `రఘు వరన్ B.Tech` తమిళ్ లో మంచి విజయం సాధించింది. మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత 2020 జనవరి1న ఇదే బ్యానర్ లో తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో ‘తూటా’ పేరుతో మీముందుకు రావడం సంతోషంగా ఉంది.
డైరెక్ట్‌గా తెలుగు సినిమాలు చేస్తారా?
కచ్చితంగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసే ఆలోచన ఉంది. మీతో వర్క్ చేయడం చాలా కంఫర్ట్‌గా ఉంది. మీతో తప్పకుండా ఓ సినిమా చేస్తాను అని ఓ సందర్భంలో గౌతమ్‌మీనన్‌గారు అన్నారు. ప్రస్తుతం మంచి కథల కోసం చూస్తున్నాం. ఆసక్తి గల కొత్త దర్శకులు మంచి స్క్రిప్ట్స్ తో వస్తే తప్పకుండా మా బేనర్ లో సినిమాలు నిర్మిస్తాం. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.