HomeTeluguTEACHERS-2030 మానిఫెస్టో ఆవిష్కరణ – తెలంగాణ విద్యా భవిష్యత్తుకు మార్గసూచిక!"- MLC అభ్యర్టి పురుషోత్తం...

TEACHERS-2030 మానిఫెస్టో ఆవిష్కరణ – తెలంగాణ విద్యా భవిష్యత్తుకు మార్గసూచిక!”- MLC అభ్యర్టి పురుషోత్తం రెడ్డి తలకోల

ఖమ్మం-నల్గొండ-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి తలకోల పురుషోత్తం రెడ్డి (సీరియల్ నం. 13) ఈరోజు “TEACHERS-2030 మానిఫెస్టో” ను హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలో ఇదే మొదటిసారి విస్తృత మైన విద్యా పరిపాలనా ప్రణాళిక రూపొందించబడిందిఅని వక్తలు అన్నారు . ఈ మానిఫెస్టో ద్వారా ఉపాధ్యాయ సంక్షేమం, విద్యా పరిరక్షణ, విద్యాసంస్థల అభివృద్ధి వంటి కీలక అంశాలకు సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదించబడింది..మేధావులు , టీచర్లు ఒకటికి నాలుగుసార్లు ఆలోచనచేసి మీసమస్యలను పరిష్కరించే స్వతంత్ర అభ్యర్టి పురుషోత్తం రెడ్డి తలకోల కు vote వేసి గెలిపించాలని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు కోరారు

✨ ప్రధాన అతిథి: డా. బి. విజయ్ కుమార్ – (మాజీ కార్యదర్శి, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్ యూనియన్స్) గ్లోబల్ విద్యా ప్రమాణాల ప్రాముఖ్యతను వివరించి, ఉపాధ్యాయుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఈ మానిఫెస్టోను అభినందించారు.

🏅 గౌరవ అతిథి:
డా. ఈ. రాజి రెడ్డి – పరిశోధన ఆధారిత విద్యా విధానం, పరిశ్రమ-విద్యా రంగ అనుసంధానాన్ని బలోపేతం చేయడం అవసరమని వివరించారు.
🔹 ప్రొ. రేఖా రావు – డిజిటల్ విద్య, పారదర్శక నియామక విధానం, ఆధునిక హంగులతో కూడిన పాఠశాలల అభివృద్ధి గురించి ఆమె అభినందన వ్యక్తం చేశారు.

💠 విశిష్ట అతిథులు:
🔹 మారం బిక్షం రెడ్డి – నైతిక విద్యా విలువలు, ఉపాధ్యాయ సాధికారత గురించి మాట్లాడారు.
🔹 ఏచూరి భాస్కర్ – (చైర్మన్, IBC Aurater) కౌశల్యాధారిత విద్య, వృత్తిపరమైన శిక్షణ ప్రాధాన్యతను వివరించారు.
🔹 రుద్ర రాజేష్ –కళలు, సృజనాత్మకతను విద్యా ప్రణాళికలో భాగం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

“TEACHERS-2030” మానిఫెస్టో ముఖ్యాంశాలు

✅ పాత పెన్షన్ పథకం (OPS) పునరుద్ధరణ & CPS రద్దు
✅ PRC ప్రకారం 53% ఫిట్‌మెంట్ అమలు & DA చెల్లింపు
✅ ఔట్‌సోర్స్డ్ & ఒప్పంద ఉపాధ్యాయుల ప్రామాణికీకరణ
✅ పారదర్శక విశ్వవిద్యాలయ నియామక విధానం & స్వాయత్తత
✅ అధునాతన మౌలిక వసతులు: డిజిటల్ తరగతులు, స్మార్ట్ ల్యాబ్‌లు, లైబ్రరీలు
✅ ప్రైవేట్ ఉపాధ్యాయ సంక్షేమం: కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సంక్షేమ బోర్డు ఏర్పాటు
✅ విద్యార్థుల అభివృద్ధి: ఉచిత విద్యా ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ

తలకోల పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, మానిఫెస్టోలో పొందుపరిచిన అన్ని హామీలను పద్ధతిగా, దశలవారీగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని, తెలంగాణ విద్యా రంగాన్ని పారదర్శకత, పురోగతి, ఉపాధ్యాయ కేంద్రీకృత విధానాలతో నూతన శిఖరాలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

“ఉపాధ్యాయులు, విద్యారంగ ప్రముఖులు, విద్యార్థుల సమగ్ర మద్దతుతో తెలంగాణను భారతదేశంలో నం.1 విద్యారాష్ట్రంగా తీర్చిదిద్దలని పురుషోత్తం రెడ్డి తలకోల అన్నారు

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES