రక్షిత్ శెట్టి హీరోగా పుష్కర్ ఫిలింస్ బ్యానర్‌పై పుష్కర్ మల్లిఖార్జున, హెచ్.కె.ప్రకాశ్ నిర్మిస్తోన్న చిత్రం `అతడే శ్రీమన్నారాయణ`. సచిన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. జనవరి 1న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో రక్షిత్ శెట్టి, బాలాజీ మనోహార్, ప్రమోద్ శెట్టి, ఇమ్రాన్, రాజేష్, డిస్ట్రిబ్యూటర్ సతీష్, రామజోగ్యశాస్త్రి, శాన్వి శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
రాజేష్ మాట్లాడుతూ – “అతడే శ్రీమన్నారాయణ` చిత్రం ప్యాన్ ఇండియా చిత్రంగా జనవరి 1న విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజుగారి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ సినిమా విడుదలవుతుంది. ఆయన బ్యానర్‌లో సినిమా వస్తుందంటే సినిమా సక్సెస్ అయినట్లే. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పటి వరకు శాన్విగారు నటించని ఓ జోనర్‌లో నటించారు. ఆమె చుట్టూనే కథంతా తిరుగుతుంటుంది. దానికి గల కారణమేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. రక్షిత్ శెట్టిలాంటి హీరోకు డైలాగ్స్ రాయడమంటే ఛాలెజింగ్ విషయం. డైరెక్టర్ సచిన్‌గారు సినిమాను అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో నడిపించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతంలో విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తుంది. అలాగే అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. నిధి అన్వేషణపైన జరిగే కథ ఇది. చిన్న పీరియాడిక్‌లా, కౌబోయ్ తరహా చిత్రం. డిఫరెంట్ జోనర్‌లో సాగుతుంది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పించే చిత్రమవుతుంది“ అన్నారు.
హీరోయిన్ శాన్వి శ్రీవాత్సవ మాట్లాడుతూ – “ఐదేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు `అతడే శ్రీమన్నారాయణ` చిత్రంతో రావడంతో చాలా సంతోషంగా ఉంది. రౌడీ సినిమా తర్వాత ఏడాదిన్నర పాటు ఏ సినిమా చేయలేదు. అయితే ప్రేక్షకుల సపోర్ట్‌తో మళ్లీ సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇంత పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది“ అన్నారు.