HomeCeleb Interviews'హేజా' హార్ట్‌ఫుల్‌గా బాగుంది అనుకుంటే చాలు - హీరో, దర్శకుడు ...

‘హేజా’ హార్ట్‌ఫుల్‌గా బాగుంది అనుకుంటే చాలు – హీరో, దర్శకుడు మున్నా కాశి.

సంగీత ద‌ర్శ‌కుడు మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “హేజా”. (ఎ మ్యూజికల్ హారర్). వి ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై వి.ఎన్. వోలేటి ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌నికెళ్ళ భ‌రణి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ముమైత్ ఖాన్, నూతన నాయుడు( బిగ్ బాస్ ఫేమ్),ల‌క్ష్మ‌న్(ఆర్.ఎక్స్ 100ఫేమ్). లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. మ్యూజికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 12 న గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు మున్నా కాశి ఇంటర్వ్యూ ..

మీ గురించి చెప్పండి ?
– నేను ఎంబిఎ గోల్డ్‌ మెడలిస్ట్‌. దుబాయ్‌లో జాబ్‌ చేశాను. నాకు చిన్నప్పట్నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. ఎలాగైనా సంగీతం మీద నాకున్న ప్యాషన్‌ని ఫుల్‌ఫిల్‌ చేసుకోడానికి జాబ్‌ కొంచెం బ్రేక్‌ తీసుకొని ఇండియా వచ్చి సంగీత దర్శకుడిగా మారాను. సంగీత దర్శకుడిగా నా మొదటి సినిమా. ఎస్వీ రంగారావుగారి మనవడు హీరోగా లాంచ్‌ అయిన ‘మిస్టర్‌ 7’. తర్వాత ‘యాక్షన్‌ 3డి’. ‘అమ్మా నాన్న ఊరెళితే’, ‘చిత్రం చెప్పిన కథ’ చిత్రాలకు సంగీతాన్ని అందించాను.రామ్‌గోపాల్‌ వర్మగారి ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’లో రెండు సాంగ్స్‌ చేశాను. ‘మామా చందమామ’ సినిమా తరువాత సంగీత దర్శకుడిగా బ్రేక్ తీసుకున్నాను.

సంగీత దర్శకుడిగా కొనసాగిన మీరు దర్శకుడిగా మారడానికి కారణం ఏంటి?
– చిన్న సినిమాలు హిట్‌ అయి టాక్‌ వస్తేనే జనాల్లోకి వెళ్తున్నాయి. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా సంగీతానికి పేరొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటి సందర్భంలో కొంతమంది నిర్మాతలు నా దగ్గరకొచ్చి హీరోగా అవకాశమిస్తాం అని బ్లాంక్‌ చెక్‌ ఇచ్చారు. అప్పటికే నాకు టెక్నీషియన్‌గా కొంత కథ మీద జడ్జిమెంట్‌ ఉండటంతో ముందు కథ చెప్పమని అడిగాను. అన్నీ రెగ్యులర్‌ కథలు కావడంతో మంచి కంటెంట్‌ ఉన్న కథ కోసం వెతకటం స్టార్ట్‌ చేశాను.

ఈ జోనర్ నే ఎంచుకోవడానికి కారణం?
– బేసిక్‌గా నేను మ్యూజిక్‌ డైరెక్టర్‌ని కాబట్టి సంగీతం మీద పట్టు ఉంటుంది. ‘చంద్రముఖి’, ‘అరుంధతి’లాంటి బలమైన హర్రర్‌ కథ అయితే బాగుంటుందని హర్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌ని ఎంపిక చేసుకోవడం జరిగింది. దానికి చిన్నప్పటి నుండి రామ్‌గోపాల్‌ వర్మ సినిమాలని ఫాలో అవడం కూడా ఒక కారణం.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి?
– ఈ సినిమాలో నాది లీడ్‌ క్యారెక్టర్‌ మాత్రమే. నా క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. రెండు గంటల సినిమాలో ప్రేక్షకులకు ఏ ఒక్క సీన్‌ కూడా అనవసరం అనిపించదు. కంటెంట్‌ వెరీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. హర్రర్‌ సినిమాలకి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా ఇంపార్టెంట్‌. అది నా డిపార్ట్‌మెంటే కాబట్టి ఈ సినిమాలో ఎక్కడ ఆర్‌ఆర్‌ ఇవ్వాలో కరెక్ట్‌గా అక్కడే ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో దెయ్యానికి, సంగీతానికి ఉన్న లింక్‌ ఏంటి? అనేది చాలా ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌. అందుకే ట్యాగ్‌లైన్‌ మ్యూజికల్‌ హర్రర్‌ అని పెట్టాం.

ముమైత్‌ఖాన్‌ ఈ సినిమాలో డెవిల్‌గా కన్పించనుంది. అది సినిమాలో కొత్త పాయింట్‌. సినిమాను మలుపుతిప్పే కీలకపాత్రలో తనికెళ్ల భరణిగారు నటించారు. ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ నూతననాయుడు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ లక్ష్మణ్‌. లీజి గోపాల్‌ ముఖ్య పాత్రలు పోషించారు.

టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
– ‘హెజా’ అనేది కొన్ని ప్రాంతాల్లో వ్యక్తుల పేర్లు. దాని అర్థం అందమైనది. ఈ సినిమాకి ఎందుకు ఆ టైటిల్‌ పెట్టాం అనేది సినిమాలో చూపించాం. సినిమా చూసి బయటికొచ్చే ప్రేక్షకుడు హార్ట్‌ఫుల్‌గా బాగుంది అనుకుంటే చాలు.

నిర్మాత గురించి?
– ఈ సినిమా నిర్మాత మా అంకుల్‌ వి.ఎన్‌. ఓలేటి. సినిమా రంగం కాదు. ఆయన ఓఎన్‌జిసి డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌. అద్భుతమైన సింగర్‌. సినిమా అంటే చాలా ఇష్టం. నాలో హర్రర్‌ ఎపిసోడ్‌లో కూర్చోబెట్టగల మంచి స్టోరి టెల్లర్‌, దర్శకుడు ఉన్నాడని నమ్మి ఈ సినిమా తీశారు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
– నా తదుపరి చిత్రానికి కూడా ఇదే ప్యాట్రన్‌ ఫాలో అవుతాను. అదిరిపోయే ఒక సెటైరికల్ స్టోరీ ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి షూటింగ్ స్టార్ట్ చేస్తాం. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES