HomeTeluguబిగ్ బాస్ లో ఆదిత్య ఓం విజయాన్ని కోరుతూ గిరిజన గ్రామాల తీర్మానం రాలీ...

బిగ్ బాస్ లో ఆదిత్య ఓం విజయాన్ని కోరుతూ గిరిజన గ్రామాల తీర్మానం రాలీ నిర్వహించిన దత్తత గ్రామాల ప్రజానీకం

భద్రాచలం డివిజన్ లోని చెరుపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని చుట్టుపక్కల గ్రామాలలో సయితం అనేక సేవా కార్యక్రమాలని చేపట్టిన సినీ నటులు ఆదిత్య ఓం విజయాన్ని కాంక్షిస్తూ గిరిజన ప్రాంతాలలోని గ్రామ సంఘాలు తీర్మానం చేశాయి.
దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గ్రామంలో ర్యాలీ మరియు శ్రీ సమ్మక్క సారక్క మీటింగ్ హాల్ లో సమావేశం ఏర్పాటు జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు మాట్లాడుతూ తమ గిరిజన గ్రామాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ విద్య వైద్య క్రీడా కార్యక్రమాల ప్రోత్సాహంతో పాటు గ్రంధాలయ ఏర్పాటు, అంబులెన్సు , మొక్కల పంపిణీ , చలికాలంలో రగ్గులు పంపిణీ , సోలార్ లైట్స్ పంపిణీ , లాప్ టాప్ పంపిణీ , టీ – సేవా కేంద్ర ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాల్లో తన సహకారాన్ని అందించిన తమ గిరిజన ప్రాంత దత్త పుత్రుడు ఆదిత్య ఓం బిగ్ బాస్ కి సెలెక్ట్ చేయడం తామందరికి గర్వకారణం అని తాను గెలిచి తమ ప్రాంతానికి మరింత పేరు తేవాలని ఆకాంక్షించారు.

గౌరవ అతిధి పాకలపాటి విజయవర్మ , కొత్తపల్లి మాజీ సర్పంచ్ గుండి వెంకటేశ్వర్లు , ఉప సర్పంచ్ చంద్రయ్య , గ్రామ పెద్దలు పాకలపాటి వెంకన్న రాజు, ముర్రం వీరభద్రం, కనితి మధు, కాదులూరి హరి ,కోటి, పిలక.వెంకటరమణారెడ్డి, కనితి ముత్తయ్య, కల్లూరి కోర్రాజు, ముత్తు, మణి, ఉపాధ్యాయులు రత్నo టీచర్ గ.సంగీత, ముర్రం సానియా, జే జి కే మూర్తి , జంగయ్య , తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES