ఘుమఘుమలాడే ఫుడ్ ఉండాలి కానీ దాన్ని ఆరగించటానికి మనం ఎంత దూరమైనా వెళతాం. మాదాపుర్ నుండి కైతలాపుర్ వెళ్లే దారిలో ఓన్లీ గుడ్ ఫుడ్ పేరుతో ఓ రెస్టారెంట్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్‌ను లంచ్ బాక్స్ ఫర్ కార్పోరేట్ క్యాటరింగ్స్‌ను గురువారం ఉదయం ప్రారంభించారు రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉన్న తారక్. హోటల్ ఓపెనింగ్‌కి బిగ్‌బాస్ స్టార్ మానస్ నాగులపల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఓ.జి.ఎఫ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మానస్ మాట్లాడుతూ– ‘ నేను ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించటానికి ముఖ్యకారణం తారక్ గారు. నేను ఏం తిన్నా కూడా చాలా హైజిన్‌గా ఉండాలి. తారక్ ఈ విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నాడు. మంచి ఫుడ్‌ను సర్వ్ చేయాలి కానీ ఎవరైనా ఎంత దూరమైనా వచ్చి తింటారు. ఓ.జి.ఎఫ్ సక్సెస్ అవ్వాలని అనేక బ్రాంచిలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. రెస్టారెంట్ ఓనర్ తారక్ మాట్లాడుతూ– ‘కూడు, నీడ, గుడ్డ ప్రతి ఒక్కరికి అవసరం. అందులో మొదటగా వచ్చేది ఫుడ్. నాకు వ్యక్తిగంతగా మంచి ఫుడ్ తినటం, వండి పెట్టడం రెండు ఇష్టమే. అందుకే రియల్ ఎస్టేట్‌లో చాలా బిజిగా ఉన్నాకూడా మంచి మనవాళ్లు మంచి ఫుడ్ తినాలి అనే ఉద్ధేశ్యంతో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించాను. ఓ.జి.ఎఫ్‌ను చక్కని బ్రాండ్‌గా తయారు చేసి త్వరలోనే అనేక బ్రాంచిలను నెలకొల్పుతాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీశ్ నాగరాజ్ తదితరులు పొల్గొన్నారు.
బిగ్‌బాస్ స్టార్ మానస్ నాగులపల్లి ప్రారంభించిన ‘ఓ.జి.ఎఫ్’…
RELATED ARTICLES