సన్నిహిత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ మరియు బ్రెయిన్ వాష్ సినిమా పతాకంపై నటి లావణ్య ప్రధాన పాత్రలో ఉపేంద్ర ఎస్ పి దర్శకత్వం లో శ్రీను కందుల నిర్మిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “ఇజ్జత్”. షూటింగ్ అంత పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీ గా ఉంది. అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క టైటిల్ పోస్టర్ ను దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు విడుదల చేశారు.
అనంతరం దర్శకుడు ఉపేంద్ర ఎస్ పి మాట్లాడుతూ “మా ఇజ్జత్ చిత్రం ఒక మధ్యతరగతి అమ్మాయి కథ. ప్రేమ పెళ్లి ని వ్యతిరేకించి, పరువు పేరుతో ఓ కుటుంబం తమ కూతురి ప్రాణాలు తీయడానికి సిద్ధం అయితే, ఆ ఆడపిల్ల తిరగబడితే ఎలా ఉంటుందో తెలియపరిచే చిత్రమే ఇజ్జత్. పరువు హత్య ల మీద వచ్చిన చిత్రాలకంటే మా చిత్రం భిన్నంగా ఉంటుంది. కొత్త కథనం తో మంచి క్వాలిటీ విజువల్స్ తో మా చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. త్వరలో విడుదల చేస్తాం” అని తెలిపారు.
చిత్రం పేరు : ఇజ్జత్
హీరోయిన్ : లావణ్య
బ్యానర్ : సన్నిహిత్ ఆర్ట్స్ ప్రొడక్షన్, బ్రెయిన్ వాష్ సినిమా
డి ఓ పి : వి ఆర్ కె నాయుడు
ఎడిటర్ : సత్య గిడుతూరి
యాక్షన్ : వింగ్ చున్ అంజి
మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : రియాన్
లిరిక్స్ : డి వి కృష్ణ
ఆర్ట్ : శ్రీధర్
కాస్టూమ్స్ : విజయ
మేకప్ : మాధవ్
ఎస్ ఎఫ్ ఎక్స్ : హేమంత్
సి జి మరియు డి ఐ : డెక్కన్ డ్రీమ్స్
సౌండ్ మిక్స్ : కృష్ణ కడియాల
కో డైరెక్టర్ : ఎస్ ఎస్ రాజు
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ : ఉదయ్ కిరణ్
లైన్ ప్రొడ్యూసర్ : శివ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ కానగర్తి
పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ టీం : ఎస్ 3 డిజిటల్ మీడియా
కో ప్రొడ్యూసర్ : మోహన్
కథ, దర్శకత్వం : ఉపేంద్ర ఎస్ పి
నిర్మాత : శ్రీను కందుల