సుహాస్, కార్తీక్‌రత్నం,రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం శ్రీరంగనీతులు. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు. రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 11న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత ధీరజ్ మొగిలినేని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రం గురువారం సెన్సారును పూర్తి చేసుకుంది. యు/ఏ సర్టిఫికెట్‌ను అందించారు. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ సినిమాను చూసిన సెన్సారు సభ్యులు అభినందించారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా చూడలేదని, తప్పకుండా చిత్రం జనాలకు నచ్చుతుందని వారి మాటలు మాలో విజయంపై మరింత నమ్మకాన్ని పెంచాయి.యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రంలో సినిమాలో వుండే ఆసక్తికరమైన కథ, కథనాలను ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే మనసుకు హత్తుకుంటాయి. కొత్తదనంతో పాటు పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందించిన చిత్రమిది అన్నారు.