హారర్ చిత్రాల్లో ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసిన చిత్రం ‘కాలింగ్ బెల్’. ఈ చిత్రం విజయం సాధించి దర్శకుడు పన్నా రాయల్‌కు మంచి పేరు తెచ్చింది. అదే స్ఫూర్తితో చేసిన రెండో సినిమా ‘రాక్షసి’ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మూడో సినిమాగా దర్శకుడు పన్నా రాయల్ రూపొందించిన మరో హారర్ అండ్ మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇంటి నెం.13’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై డా. బర్కతుల్లా సమర్పణలో హేసన్ పాషా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉండే ఈ సినిమాను హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో రూపొందించడం విశేషం. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ విడుదలై ఆడియన్స్‌లో సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఈమధ్యకాలంలో చక్కని హారర్ థ్రిల్లర్స్ రాలేదు. దాన్ని భర్తీ చేస్తూ ఇప్పుడు ‘ఇంటి నెం.13’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి 23న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఈ సినిమా విశేషాలను చిత్ర దర్శకుడు పన్నా రాయల్ తెలియజేస్తూ ‘‘ఆడియన్స్‌కి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే సినిమా ఇది. ఇప్పటివరకు సస్పెన్స్ థ్రిల్లర్స్ చాలా వచ్చాయి. కానీ, ఈ సినిమాలోని యునీక్ పాయింట్ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంది. ప్రతి పది నిమిషాలకు వచ్చే ట్విస్ట్‌తో ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ గ్యారెంటీ. ఇప్పటి వరకు తెలుగు ఆడియన్స్ చూడని విధంగా ఈ మిస్టీరియస్ థ్రిల్లర్‌ని రూపొందించడం జరిగింది. ఈ జోనర్‌లో డెఫినెట్‌గా ‘ఇంటి నెం.13’ ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కాదు, టెక్నికల్‌గా భారీ చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా ఎంతో రిచ్‌గా రూపొందించాం. ఎట్టి పరిస్థితుల్లో ఆడియన్స్‌ని థ్రిల్ చెయ్యాలన్న ఉద్దేశంతో హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో ఓ విజువల్ వండర్‌గా ‘ఇంటి నెం.13’ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. నేను చెప్పిన కొత్త పాయింట్‌ని విని ఎంతో ఇంప్రెస్ అయిన మా నిర్మాత హేసన్ పాషాగారు ఖర్చుకు వెనకాడకుండా చాలా రిచ్‌గా ఈ సినిమాన్ని నిర్మించారు’’ అన్నారు.
నిర్మాత హేసన్ పాషా మాట్లాడుతూ ‘‘మా డైరెక్టర్ పన్నా చాలా మంచి టెక్నీషియన్. తను అనుకున్న పాయింట్‌ని స్క్రీన్‌మీద ఎలా ప్రజెంట్ చేస్తే ఆడియన్స్‌ని రీచ్ అవుతుందో అతనికి బాగా తెలుసు. ఇంతకుముందు అతను తెరకెక్కించిన కాలింగ్ బెల్, రాక్షసి చిత్రాల్లో అది నేను గమనించాను. ఇంటి నెం. 13 పాయింట్ చెప్పినపుడు చాలా ఎక్సైట్ అయ్యాను. తప్పకుండా ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. పన్నా టేకింగ్, ఫుటేజ్ చూసిన తర్వాత నా నమ్మకం రెట్టింపు అయ్యింది’’ అన్నారు.
నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్‌రాజ్, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్, నెల్లూరు సుదర్శన్, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, దేవియాని తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు సంగీతం: వినోద్ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.మణికర్ణన్, ఎడిటింగ్: సాయినాథ్ బద్వేల్, కొరియోగ్రఫీ: కె.శ్రీనివాస్, మాటలు: వెంకట్ బాలగోని, పన్నా రాయల్, పాటలు: రాంబాబు గోశాల, నిర్మాత: హేసన్ పాషా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్.
6 Attachments
• Scanned by Gmail