కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్‌గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్. క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మించిన ‘‘ఉపేంద్ర గాడి అడ్డా’’ చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగింది.
.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ…
మా ఎస్.ఎస్.ఎల్.ఎస్. బ్యానర్‌పై నిర్మించిన ‘ఉపేంద్రగాడి అడ్డా’ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ బ్యానర్‌పై భవిష్యత్తులో రాబోయే చిత్రాలు కూడా ఖచ్చితంగా కంటెంట్ ప్రధానంగానే ఉంటాయి. కంటెంట్ లేకుండా మేం ప్రేక్షకుల ముందుకు రాము అని ఘంటాపథంగా చెపుతున్నాను. మా బ్యానర్‌పై వచ్చే ప్రతి సినిమా మెసేజ్ ఓరియెంటెండ్‌గానే ఉంటాయి అని మాట ఇస్తున్నా. మేం నిర్మించే చిత్రాల నుంచి వచ్చే డబ్బులో కొంత భాగాన్ని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగించాలనే ఆలోచనలో ఉన్నాం. త్వరలోనే సినిమాల ద్వారా వచ్చిన లాభాలను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాం. ఉపేంద్ర గాడి అడ్డాను తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నాం. తుఫాన్ పోగానే చెన్నైలో భారీ ఎత్తున ప్రెస్‌మీట్ పెట్టి సినిమాను ప్రమోట్ చేస్తాం. అలాగే హిందీలో విడుదల చేయటానికి హక్కులు అడిగారు. జీఎంఆర్ గ్రూపువారు. ఇలా చాలా మంది అడుగుతున్నారు. ఈ సినిమా ప్రతి ఊరిలోనూ విడుదలై మేం ఈ సినిమాలో చూపించిన మెసేజ్ అందరికీ చేరాలని నా కోరిక. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము తీసిన “కంచర్ల” సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నాం” అని అన్నారు.
చిత్ర హీరో ఉపేంద్ర మాట్లాడుతూ…
ఈరోజు ఈ స్టేజ్‌మీద నేను నిలబడటానికి కారకులైన అందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు. నేను హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మా నాన్నగారు, ఆయన బృందం అండగా నిలిచారు. నేను హీరోగా ప్రేక్షకులకు డైరెక్ట్‌గా కనెక్ట్‌కావడంతో అందరూ నన్ను గుర్తుపట్టి అభినందిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. మీడియా మిత్రులు కూడా రేటింగ్ పరంగా, నటన పరంగా నన్ను, మా సినిమాను మెచ్చుకోవడం హ్యాపీగా ఉంది. ఈ ప్రోత్సాహం నా రాబోయే చిత్రాల్లో నాకు చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో కూడా నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. ఈ సక్సెస్ ఈ థ్యాంక్స్‌మీట్ సందర్భంగా మా యూనిట్ అందరికీ థ్యాంక్స్. దర్శకుడు ఆర్యన్ సుభాన్ గారు తాను నాకు ముందు కథ చెప్పిన విధానం బాగా నచ్చింది. దాన్ని తెరమీద ఇంకా అందంగా చూపించారు. ప్రతి టెక్నీషియన్‌కు నా కృతజ్ఞతలు. మేం పడ్డ కష్టానికి ఈ విజయం బూస్టప్ ఇచ్చింది. అందరికీ ధన్యవాదాలు అన్నారు.
చిత్ర దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ… ప్రే క్షకులకు కావాల్సిన అంశాలతో పాటు కొంత సందేశాత్మక పాయింట్ ను కూడా ఇందులో ఆవిష్కరించాం. నిర్మాత, హీరో ,టెక్నీషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు.మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు అని అన్నారు.
హీరోయిన్ సావిత్రి కృష్ణ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
ఇదే కార్యక్రమం లో 2024 మార్చి 8న విడుదల కానున్న హీరో ఉపేంద్ర కొత్త చిత్రం ‘ఐపీఎస్369’ చిత్రం పోస్టర్‌ను లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సహ నిర్మాతలు కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత,.సంగీత దర్శకుడు, రాము అద్దంకి, సినిమాటోగ్రాఫర్ రవీందర్ సన్, సంభాషణల రచయిత శ్రీనివాస్ తేజ, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ సినిమా విజయం సాధించడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు