అక్షర క్రియేషన్ పతాకంపై, స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మాతగా, నగేష్ నారదాసి దర్శకుడుగా, రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “తలకోన” . టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో సుపరిచితమైన అప్సర రాణి ఈ చిత్రంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. కాగ ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
ఈ సంద్భంగా ‘తలకోన’ చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ… క్రైమ్ థ్రిల్లర్ తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు అందులో ఇంకో కోణం కూడా ఉటుందని, అదే విదంగా పాలిటిక్స్ ని కూడా మిక్స్ చేసి చూపించడం జరిగిందని అంతే కాకుండా ప్రకృతికి విరుద్ధంగా వెళితే జరిగే పరిణామాలు కూడా తెలిపే ప్రయత్నం చేసామన్నారు.మెయిన్ కథాంశం ఏమిటంటే, తలకోన ఫారెస్ట్ లోకి హీరోయిన్ కొంతమంది స్నేహితులతో కలిసి వెళ్తుంది..ఎంత మంది వెళ్లారు ఎంతమంది తిరిగొచ్చారు అనేది ప్రధానాంశంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందిస్తున్నాము.. అందుకు తగ్గ టీమ్ ను, టెక్నికల్ టీమ్ ను కూడా సినిమాకు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా నవంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది అని తెలిపారు.
నిర్మాత .దేవర శ్రీధర్ రెడ్డి(చేవెళ్ల) మాట్లాడుతూ… “తలకొన”నిర్మాత గా నా మొదటి ప్రయత్నం. షూటింగ్ అంతా అద్భుతంగా జరిగింది. అప్సర రాణి వెండి తెర పై గ్లామర్ క్వీన్ అని అందరికీ తెలుసు కానీ ఈ సినిమా తో యాక్షన్ క్వీన్ గా కూడా ఆమెకు మంచి నేమ్ వస్తుంది. అలాగే అజయ్ ఘోష్, శ్రవణ్ వంటి సీనియర్ నటుల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నేను కొత్త వాడినైన నా టెక్నిషియన్స్ చాలా ఎంకరేజ్ చేస్తూ పని చేశారు . కనుక ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు.
నటీనటులు: అప్సర రాణి, అశోక్ కుమార్, అజయ్ ఘోష్, ఉగ్రం మంజు, విజయ్ రంగరాజు, రాజా రాయ్, యోగి కత్రి, కరణ్ విజయ్, డెబోరో, ముస్కాన్, చంద్రిక, అరుణ, లత తదితరులు నటించిన ఈ చిత్రానికి
సమర్పణ : స్వప్న శ్రీధర్ రెడ్డి
పి ఆర్ ఓ : బాసింశెట్టి వీరబాబు
డిఓపి : మల్లికార్జున్ – EHV ప్రసాద్
మ్యూజిక్ : సుభాష్ ఆనంద్
ఫైట్స్ : వింగ్ చన్ అంజి
ఎడిటింగ్ :ఆవుల వెంకటేష్
కొరియోగ్రఫీ : చార్లీ
ఆర్ట్ : విజయ కృష్ణ
స్టిల్స్: భద్రం
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : పరిటాల రాంబాబు
ఆడియోగ్రఫీ : సాగర్
నిర్మాత: దేవర శ్రీధర్ రెడ్డి (చేవెళ్ల)
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నగేష్ నారదాసి.