దేశముదురు సినిమాతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన హన్సిక అనతికాలంలోనే అగ్రకథానాయికగా గుర్తింపును సొంతం చేసుకున్నది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నాయికగా నటించిన ఆమె కథానాయికగా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం మై నేమ్ ఈజ్ శృతి శ్రీనివాస్ ఓంకార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మాత. నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి పోరాటం పోరాటం అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కష్ణకాంత్ రచించిన ఈ పాటకు మార్కె కె రోబిన్ సంగీతం అందించగా, రాహుల్ సిప్లిగంజ్, హారిక నారాయణన్, సత్య యామిని ఆలపించారు. ఇప్పటి వరకు రానటువంటి ఓ విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా వుంటుంది. సినిమాలో వుండే ట్విస్ట్ లు అందరిని కట్టిపడేస్తాయి. చివరి వరకు ఎవరి ఊహకందని కథాంశమిది. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం వుంది‘ అన్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని, కొత్తదనం కోరుకునే ప్రతి ఒక్కరికి మా చిత్రం తప్పకుండా నచ్చుతుందని నిర్మాత తెలిపారు.
హన్సిక మాట్లాడుతూ శృతి అనే యువతిగా ఈ సినిమాలో కనిపిస్తా. తన భావాల్ని ధైర్యంగా వెల్లడించే యువతిగా విభిన్నంగా నా పాత్ర ఉంటుంది. ఆద్యంతం మలుపులతో ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. కథ వింటున్నప్పుడు తర్వాత ఏం జరుగుతుందనే ముంగింపు వరకు నేను ఊహించలేకపోయాను అన్నారు.
మురళీశర్మ, ఆర్ నారేయనన్, జయప్రకాష్, వినోదిని, సాయితేజ, పూజా రామచంద్రన్, రాజీవ్ కనకాల ముఖ్య త్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కిశోర్ బోయిడపు, కళా దర్శకత్వం: గోవింద్, సంగీతం: మార్క్ కె రాబిన్, ఎడిటర్ చోటా.కె.ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: జి సుబ్బారావు, పోస్టర్ డిజైనింగ్: విక్రమ్ విజన్స్, కాస్ట్యూమ్ డిజైనర్ అమృత బొమ్మి, పీఆర్‌వో: మడూరి మధు, కాస్ట్యూమ్ ఛీఫ్: సర్వేశ్వరరావు, కో ప్రొడ్యూసర్ పవన్‌కుమార్ బండి