అంతర్జాతీయ స్థాయికి తగ్గకుండా మంచి నిర్మాణ విలువలతో ప్రేక్షకులను అలరించాలనే సదుద్దేశంతో శుక్రవారం మార్చి 24 సాయంత్రం హైదరాబాద్ లో కమర్ ఫిల్మ్ ఫ్యాక్టరి విజయవంతంగా ప్రారంభం అయింది. భావానికి భాష అవసరం లేదు అన్నట్లే.. సినిమాకు కూడా భాషా భేదం లేదని, ఎటువంటి సరిహద్దులు లేవని సినిమా వ్యాపారవేత్తలు ఎప్పటినుంచో విశ్వసిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాలు వివిధ భాషల్లో డబ్బింగ్ అవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ తరుణంలో థియేటర్ల దగ్గర సినిమాలు విడుదలైనప్పటికీ ఓటిటి ప్రాధాన్యత బాగా పెరిగింది. ఇండియన్ యంగ్ బిజినెస్ కమర్ సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. తాను ఇండియా లెవెల్ లో ఓటీటి కంటెంట్ ను ప్రజెంట్ చేయడమే లక్ష్యంగా కమర్ ఫిలిం ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, దాని ద్వారా సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు వినోదాన్ని అలరిస్తూనే సినిమాలో నటించే నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఉపాధి కల్పించాలని ఒక గొప్ప ఉద్దేశంతో తన వ్యాపారాన్ని భారతదేశం మొత్తం విస్తరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మార్చి 24, 2023 శుక్రవారం రోజు హైదరాబాదులోని ఓ ప్రముఖ హోటల్లో కమర్ ఫిలిం ఫ్యాక్టరీని మీడియా, పత్రిక విలేకరుల సమక్షంలో ఘనంగా ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా బాక్స్ క్రికెట్ లీగ్ ప్రొప్రైటర్, కమ్మర్ ఫిలిం ఫ్యాక్టరీ అధినేత కమర్ మాట్లాడుతూ… ప్రేక్షకుల కోసం అంతర్జాతీయ విలువలతో మంచి సినిమా కంటెంట్లను ప్రోత్సహించడానికి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ నిర్మాణంలో జరిగే సినిమాలను ఓటిటి ద్వారా ప్రజల్లోకి తీసుకొస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నట్లు చెప్పారు. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, మళియాలంలో సినిమాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇంకా మాట్లాడుతూ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని తన కోరికను బయటపెట్టాను. ఫ్యాషన్ టీవీ ఇండియా, బాక్స్ క్రికెట్ లీగ్, ఫిల్మ్ ఫేయిర్ లాంటిసంస్థలను దిగ్విజయంగా నడుపుతూ.. ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నా కమర్ ఫిలమ్ ఫ్యాక్టరీ ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు, కెఎఫ్ఎఫ్ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సినిమా నిర్మాణ పనులు కూడా ప్రారంభం చేస్తున్నాట్లు అందుకోసం వర్థమాన ఫిల్మ్ మేకర్స్ తో సంభాషిస్తున్నట్లు తెలిపారు.