HomeTeluguసబ్జెక్టును నమ్ముకుని "అల్లంత దూరాన" తీశారు: ఎ.పి.ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ

సబ్జెక్టును నమ్ముకుని “అల్లంత దూరాన” తీశారు: ఎ.పి.ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ

సబ్జెక్టును నమ్ముకుని, అందుకు తగ్గ ఆర్టిస్టులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకుని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విజువల్ ఫీస్ట్ గా తీసిన సినిమా “అల్లంత దూరాన’ అని ప్రముఖ హాస్య నటుడు, ఎ.పి.ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ పేర్కొన్నారు.

గతంలో బాలనటుడిగా,, ఆ తర్వాత హీరోగా రాణిస్తున్న విశ్వ కార్తికేయ హీరోగా, ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా చలపతి పువ్వల దర్శకత్వంలో ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 10న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అలీ ట్రైలర్ విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, నిర్మాత చంద్రమోహన్ రెడ్డి మొదలుకుని సినిమా పట్ల ఎంతో ప్రేమ ఉన్న ప్రేమికులు చేసిన సినిమా ఇది. కరోనా సెకండ్ వేవ్ లో కూడా అనుమతి తెచ్చుకుని మరీ కేరళ లొకేషన్స్ లో షూటింగ్ చేశారు” అని అన్నారు.

మరో అతిథి డి.ఎస్.రావు మాట్లాడుతూ , “ఈ సినిమా టీజర్ చూడగానే కళాతపస్వి కె.విశ్వనాథ్, ఆయన తీసిన సినిమాలు గుర్తుకొచ్చాయి. ఎంతో కస్టపడి తీసిన ఇలాంటి చిన్న సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని అన్నారు. నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ, ఎంతో తపనతో ఒక మంచి ప్రేమకథా సినిమాను ప్రేక్షకులకు అందించాలని ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలో తీశామని చెప్పగా, ప్రతీ ప్రేక్షకుడు మెచ్చుకునేవిధంగా ఈ సినిమా ఉంటుందని, మంచి, మంచి సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారని దర్శకుడు చలపతి పువ్వల అన్నారు

హీరో విశ్వ కార్తికేయ, హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ సినిమా చేయడానికి సబ్జెక్టు నచ్చడమే ప్రధాన కారణమని, మనసులను హత్తుకునేలా ఉంటుంది. రధన్ సంగీతం, కళ్యాణ్ ఛాయాగ్రహణం అలరిస్తాయి” అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో గీత రచయిత రాంబాబు, దర్శకులు రాజశేఖర్, రాజ్, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు తదితరులు పాల్గొన్నారు.

.ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో భాగ్యరాజా, అలీ, ఆమని, తమిళ్ జేపీ, తులసి, జార్డమేరియన్, అప్పాజీ, అనంత్ , ఇళవరసన్, డానియెల్, స్వామినాథన్, కృష్ణవేణి, నారాయణరావు, శివ తదితరులు తారాగణం.

ఈ చిత్రానికి పాటలు: రాంబాబు గోశాల, సంగీతం: రధన్ (జాతి రత్నాలు ), కెమెరా: కళ్యాణ్ బోర్లగాడ్డ, ఎడిటింగ్: శివకిరణ్,
డాన్స్: గోపి, ఫైట్స్: నాభ, ఆర్ట్: చంద్రమౌలి, సమర్పణ: శ్రీమతి కోమలి, నిర్మాత: ఎన్.చంద్రమోహనరెడ్డి, రచన-దర్శకత్వం: చలపతి పువ్వల.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES