HomeTeluguసుధీర్ బాబు ఎప్పటికీ గుర్తుపెట్టుకునే సినిమా 'హంట్'... భవ్య క్రియేషన్స్ లేకపోతే ఈ సినిమా లేదు -...

సుధీర్ బాబు ఎప్పటికీ గుర్తుపెట్టుకునే సినిమా ‘హంట్’… భవ్య క్రియేషన్స్ లేకపోతే ఈ సినిమా లేదు – దర్శకుడు మహేష్ ఇంటర్వ్యూ

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. మహేష్‌ దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీకాంత్, తమిళ హీరో భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మహేష్ మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు…

‘హంట్’ సినిమా ఎలా మొదలైంది?
మహేష్ : ముందు భవ్య క్రియేషన్స్ సంస్థలో సినిమా చేయడం ఫిక్స్ అయ్యింది. వాళ్ళకు నేను కథలు చెబుతున్నాను. తొలుత ఓ ప్రేమ కథ అనుకున్నాం. కానీ, స్క్రిప్ట్ స్టేజిలోనే పక్కన పెట్టేశాం. తర్వాత స్పై థ్రిల్లర్ అనుకున్నాం. అది కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్. హీరోలకు కథలు చెబుతున్న సమయంలో… అనుకోకుండా ఓ రోజు ‘హంట్’ ఐడియా చెప్పా. స్పై థ్రిల్లర్ కంటే ముందు కథ రాశా. స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో వెంటనే స్టార్ట్ చేయొచ్చని, సుధీర్ బాబు అయితే బావుంటుందని చెప్పారు. ఆయనకు కథ చెప్పా. రెండు రోజుల్లో సినిమా ఓకే అయిపొయింది.

‘హంట్’ కథకు స్ఫూర్తి ఏమైనా ఉందా?
మహేష్ : హీరోకి మెమరీ లాస్ అనేది కొన్ని సినిమాల్లో చూశారు. గతం మర్చిపోవడానికి ముందు, వెనుక ఏం జరిగింది? అనేది డ్రామా. మా ‘హంట్’ సినిమాలో ఆ డ్రామా కంప్లీట్ డిఫరెంట్ & కొత్తగా ఉంటుంది. చాలా మంది హాలీవుడ్ సినిమాలు, ‘బార్న్ అల్టిమేటమ్’ అని చెబుతారు. హీరో గతం మర్చిపోయి, తెలుసుకునే ప్రాసెస్ చాలా సినిమాల్లో ఉంది.

మెమరీ లాస్ అంటే చాలా మంది ఫన్నీగా ఆలోచిస్తారు. మీరు యాక్షన్ ఎలా కనెక్ట్ చేశారు?
మహేష్ : హీరో మిస్టరీ సాల్వ్ చేయాల్సి వస్తే… సిట్యువేషన్స్ సీరియస్ అవుతాయి. డూ ఆర్ డై సిట్యువేషన్ ఎదురైనప్పుడు డ్రామాలో సీరియస్ సన్నివేశాలు వస్తాయి. మేం ఓ కొత్త పాయింట్ చెబుతున్నాం. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు… క్లైమాక్స్ చూసి ఎంజాయ్ చేస్తాడు. అప్పటి వరకు పడిన టెన్షన్ కు సరిపడా శాటిస్ ఫ్యాక్షన్ ఉంటుంది.

హీరో సుధీర్ బాబు మీకు ఎటువంటి సపోర్ట్ ఇచ్చారు?
మహేష్ : ఆయన వెరీ కమిటెడ్ పర్సన్. మనస్ఫూర్తిగా చెబుతున్నా… సుధీర్ బాబు నిజాయతీగా ఉంటారు. ”నాకు ఈ విధంగా అనిపిస్తుంది. ఫైనల్ డెసిషన్ నీదే” అని  మనసులో ఉన్నది చెప్పేస్తారు. టైమ్, డిసిప్లేన్ అయితే నెక్స్ట్ లెవల్. ఈ కథలో హీరోయిన్ లేరు, అదొక రిస్క్ ఎలిమెంట్. కమర్షియల్ సినిమాలు చేసే హీరోలు కొన్ని కొన్ని ఆలోచిస్తారు. ఆయన అటువంటివి అన్నీ పక్కన పెట్టి నాకు ఎంతో సపోర్ట్ చేశారు.

సినిమాలో ఒక్కటే పాట ఉన్నట్టుంది కదా!
మహేష్ : అవును. ఉన్న ఒక్క పాట కూడా న్యూ ఇయర్ పార్టీ సాంగ్ తరహాలో ఉంటుంది. పాటలు పెడితే డైవర్షన్ అవుతారేమో అనిపించింది. ఈ రోజుల్లో పాటలు కూడా అవసరం లేదనిపిస్తుంది. ‘ఖైదీ’ కథంతా రాత్రిలో జరుగుతుంది. ఒక్క లేడీ క్యారెక్టర్ కనిపించదు. విలన్స్, డ్రగ్స్, లారీ ఓ చోటు నుంచి మరో చోటుకు వెళ్ళడం… అంతే కదా! అయినా ప్రేక్షకులు ఆదరించారు. ‘విక్రమ్’ చూడండి. ఆ సినిమాలో కూడా హీరోయిన్ లేదు, నిడివి 2.50 గంటలు. ప్రేక్షకులు చూశారు. ఆ సినిమాలు కాన్ఫిడెన్స్ ఇచ్చాయి.

‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన్ను తీసుకోవడానికి కారణం ఏంటి?
మహేష్ : సినిమాలో ఆయనది చాలా ఇంపార్టెంట్ రోల్. భరత్ కంటే ముందు కొంత మంది తెలుగు నటులను కూడా పరిశీలించాం. అయితే… సుధీర్ బాబు, భరత్ కాంబినేషన్ కొత్తగా ఉంటుందని అనిపించింది. ఆయన తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయనకు కథ బాగా నచ్చింది. ఆ సమయంలో తెలుగు సినిమా చేయాలని బలంగా ఉన్నారు.

సీనియర్ హీరో శ్రీకాంత్ ను తీసుకోవడానికి కారణం?
మహేష్ : సినిమాలో సుధీర్ బాబుకు ఒక మార్గదర్శి లాంటి రోల్ ఉంది. హీరోకి సలహాలు ఇస్తూ… మోరల్ సపోర్ట్ ఇచ్చే క్యారెక్టర్ ఉంటుంది. ఆ పాత్ర ఎవరు చేస్తే బావుంటుంది? అనిపించినప్పుడు… శ్రీకాంత్ గారు గుర్తొచ్చారు. ఆయన్ను స్క్రీన్ మీద చూస్తే బావుంటుంది. లుక్స్ & స్క్రీన్ ప్రజెన్స్ కోసం తీసుకున్నా. ఆయన్ను ఇప్పుడు ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్లలో చూపిస్తున్నారు. అలా కాకుండా మంచిగా, 40 ఇయర్స్ ప్లస్ ఏజ్ లో చూపించాను.

హంట్’ను ఓ లైనులో చెప్పాలంటే ఎలా చెబుతారు?
మహేష్ : ఓ యాక్సిడెంట్ లో గతం మర్చిపోయిన పోలీస్ ఆఫీసర్… తనను తాను తెలుసుకుంటూ, జీవితంలో జరిగిన ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ తాలూకూ మిస్టరీని ఎలా చేధించాడు? అనేది సినిమా. అన్నీ గుర్తుండి సాల్వ్ చేయడం ఒక పద్ధతి. ఏమీ తెలియనివాడు ఎలా సాల్వ్ చేశాడనేది మిస్టరీ.

సుధీర్ బాబు ఫిట్నెస్ ఫ్రీక్. ఈ సినిమా కోసం ఏమైనా ప్రత్యేకంగా జిమ్ చేశారా?
మహేష్ : లీన్ లుక్ కోసం ట్రై చేశారు. బల్క్ బాడీ కంటే సన్నగా ఉండాలని, ఇంకా ఫిట్ గా కనిపించాలని అనుకున్నారు. హెయిర్ స్టైల్ షార్ట్ చేశాం. ఆయన బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. గతం మర్చిపోవడానికి ముందు, వెనుక డిఫరెన్స్ చూపించారు. మెమరీ లాస్ తర్వాత, హీరోలో అంతకు ముందు ఉన్న కాన్ఫిడెన్స్ ఉండదు. మళ్ళీ చివరకి వచ్చేసరికి కాన్ఫిడెన్స్ రావాలి. ఆ వేరియేషన్ సుధీర్ బాబు బాగా చూపించారు.

యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఫారిన్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ను తీసుకొచ్చారు. పారిస్ లో షూటింగ్ చేశారు. కథ డిమాండ్ చేసిందా? ఎలివేషన్ కోసమా?
మహేష్ : రెండూ అనుకోవాలి. రియలిస్టిక్ యాక్షన్ సినిమా చేయాలనుకున్నప్పుడు అందులో యాక్షన్ పార్ట్ కూడా రియలిస్టిక్ గా ఉండాలి. బాడీ డబుల్ లేకుండా చేయాలనుకున్నాం. సుధీర్ బాబు ఎప్పట్నుంచో ఆ స్టంట్ కొరియోగ్రాఫర్స్ టీమ్ చేసే వీడియోలను ఇన్స్టాలో ఫాలో అవుతున్నాడు. నాకు చూపించాడు. అప్పుడు వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడటం స్టార్ట్ చేశా. తొలుత కన్వర్జేషన్ కొంచెం కష్టమైనా… తర్వాత అంతా సెట్ అయ్యింది. వాళ్ళను ఇండియాకి తీసుకు వస్తే… మన ఫైటర్లకు, వాళ్ళకు సింక్ అవ్వదు. అందుకని, పారిస్ వెళ్ళి అక్కడ ఫైటర్లతో షూట్ చేశాం. కార్ పార్కింగ్ ఏరియాలో ఒక ఫైట్ చేశాం. ఇండియాలో జరిగే ఫైట్ అది. కానీ, మేం ఫారిన్ లో చేశాం.

సినిమాలో మొత్తం ఎన్ని ఫైట్స్ ఉన్నాయి?
మహేష్ : ఆరు ఉన్నాయి. అందులో రెండు ఛేజింగ్ సీక్వెన్సులు. రోజూ ఏదో ఒక యాక్షన్ పార్ట్ షూటింగ్ చేశాం. టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఫైట్స్ బావున్నాయని చెబుతున్నారు. సినిమా విడుదల తర్వాత థియేటర్లలో ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.

నిర్మాత వి. ఆనంద ప్రసాద్, భవ్య క్రియేషన్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించింది?
మహేష్ : నేను తేజ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేశా. నా ఫస్ట్ సినిమా భవ్య క్రియేషన్స్ లోనే. అప్పటి నుంచి ఆనంద ప్రసాద్ గారు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి గారితో పరిచయం ఉంది. నాకు ఎంతో బాగా చూసుకున్నారు. నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. 2020లో ఓ కథ అనుకుని రవి గారిని కలిశా. వేర్వేరు కారణాల వల్ల కుదరలేదు. అయినా నాతో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయారు. హిట్ దర్శకుడిని చూసుకున్నట్టు చూసుకున్నారు. హీరో ఎవరనే డిస్కషన్ మాత్రమే జరిగేది. వాళ్ళ వల్లే ‘హంట్’ వచ్చింది. దర్శకుడిగా నా తొలి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్. అయినా సరే ఇంత భారీ తారాగణం, నిర్మాణ వ్యయంతో సినిమా తీశానంటే ఆనంద ప్రసాద్ గారు, రవి గారే కారణం. వాళ్ళ వల్లే ఈ రోజు నేను ఇలా నిలబడగలిగా.

హంట్’ టైటిల్ పెట్టడం వెనుక కారణం ఏమిటి?
మహేష్ : కథలో ఏం ఉందో… అదే చెప్పాలనుకున్నాం. మొదట తెలుగు టైటిల్ పెట్టాలని ఆలోచించాం. కానీ, కుదరలేదు. తర్వాత ‘హంట్’ ఫిక్స్ చేశాం.

జిబ్రాన్ సంగీతం గురించి?
మహేష్ : యాక్షన్ సినిమాలకు రీ రికార్డింగ్ చాలా ఇంపార్టెంట్. ముందు చాలా ఆప్షన్స్ అనుకున్నాం. నాకు ఎప్పుడూ జిబ్రాన్ తో పని చేయాలని ఉండేది. ‘రన్ రాజా రన్’, ‘జిల్’ నుంచి! ఆయన సౌండింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన కూడా కథ విని ఓకే చేశారు. ముందు నుంచి ఈ సినిమాకు నా ఫస్ట్ ఛాయస్ జిబ్రాన్.

చివరగా, సినిమా గురించి ఏం చెబుతారు?
మహేష్ : టీజర్, ట్రైలర్ చూశాక… స్టంట్స్, ఫైట్స్ గురించి చెబుతున్నారు. మా సినిమాలో అవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఫైట్స్ వల్ల సినిమాలు ఆడతాయని నేను నమ్మను. ఎమోషనల్ కంటెంట్ వల్ల సినిమాలు నిలబడతాయి. ‘హంట్’లో సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ క్యారెక్టర్ల మధ్య స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చేసరికి ప్రేక్షకులు ఉద్వేగానికి గురి అవుతారు. ఫైట్స్ కంటే అక్కడ ఎమోషన్ ప్రేక్షకులను హంట్ చేస్తుంది. క్లైమాక్స్ చూశాక మంచి ఫీలింగ్ తో, బరువెక్కిన గుండెతో బయటకు వెళతారు. సినిమాటోగ్రాఫర్ అరుల్ విన్సెంట్ బాగా చేశారు. ఇది సుధీర్ బాబు కెరీర్ డిఫైన్ చేసే సినిమా అవుతుంది. అతను ఎప్పటికీ గుర్తు పెట్టుకునే సినిమా అవుతుంది.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES