1990’s లో సామాజిక స్థాయి బేధాలు, పరువు హత్యలు ప్రేమికుల పాలిట శాపాలుగా నడుస్తున్న కాలంలో, కట్టుబాట్లకి, సాంప్రదాయాలకి, ప్రేమ అతీతమైనదని అమ్మవారే సాక్షి గా నిలిచి.. గెలిపించిన సరి కొత్త ప్రేమ కథ ఇది.
అన్విక ఆర్ట్స్ వారి ఎర్రగుడి (అమ్మవారి సాక్షిగా అల్లుకున్న ప్రేమ కథ) చిత్ర ప్రారంభోత్సవం డిసెంబర్ 19వ తేదీ సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. హీరో వెంకట్ కిరణ్, హీరోయిన్ శ్రీజిత ఘోష్ లపై చిత్రీకరించిన ముహూర్త దృశ్వానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రభు క్లాప్ కొట్టగా, ప్రొడ్యూసర్ జెవిఆర్ కెమెరా స్విచాన్ చేసారు. సీనియర్ దర్శక నిర్మాత తమ్మురెడ్డి భరద్వాజ తొలి షాట్ కి దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. ఎర్రగుడి సినిమా లవ్, సెంటిమెంట్, స్పిరిట్యువల్ అంశాలతో ఉంటుంది. 1975 ప్రాంతంలో కథ మొదలై – 1992 తో పూర్తివుతుంది. గ్రామీణ నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న ప్రేమకథ ఇది. ఆదిత్య ఓం, సత్య ప్రకాష్, ఎస్తేర్, సమ్మెట గాంధీ, అజయ్ ఘోష్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అందరి సహకారంతో “ఎర్రగుడి” సినిమాని మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తాం అన్నారు.
హీరో వెంకట్ కిరణ్ మాట్లాడుతూ.. ఒక పవర్ఫుల్ స్టోరీలో హీరోగా చేసే అవకాశం కల్పించినందుకు డైరక్టర్ సంజీవ్ గారికి, మాటీమ్ కి ధన్యవాదములు అన్నారు.
హీరోయిన్ శ్రీజిత ఘోష్ మాట్లాడుతు.. తెలుగులో చేస్తోన్న మరో మంచి సినిమా ఎర్రగుడి . రెండు వేరియేషన్స్ ఉన్న హీరోయిన్ పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన డైరక్టర్ కి థాంక్స్ అన్నారు.
సీనియర్ నటులు సమ్మెట గాంధీ మాట్లాడుతూ.. సంజీవ్ గారు మల్టీటాలెంటెడ్ పర్సన్. నాకు ఈ సినిమాలో కొత్త తరహా పాత్ర ఇచ్చారు. ఈ “ఎర్రగుడి” సినిమా అమ్మవారి ఆశీస్సులతో పెద్ద విజయం సాధిస్తుంది అన్నాడు.
నిర్మాణ సారధి ఘంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. పర్ఫెక్ట్ ప్లానింగ్తో ‘ఎర్ర గుడి” చిత్రం నిర్మాణం చేస్తున్నాం. కమర్షియల్ గా ఈసినిమా పెద్ద విజయం సాధిస్తుంది అన్నారు.
లైన్ ప్రొడ్యూసర్ ఆర్.డి.ఎస్.. మాట్లాడుతూ.. సంజీవ్ మేగోటి గారికి డైరక్టర్ 12వ సినిమాఇది . అన్ని ఎమోషన్స్ చక్కగా కుదిరిన సినిమా ఎర్రగుడి. మా టీమ్ అందరం గట్టి ప్రయత్నిం చేస్తున్నాం. మంచి ఫలితం వస్తుందని నమ్ముతున్నాం అన్నారు.
అతిధిగా విచ్చేసిన నిర్మాత జె.వి.ఆర్ మాట్లాడుతూ.. డైరక్టర్ సంజీవ్ తో కలిసి ఎంతోకాలంగా ట్రావెల్ చేస్తున్నాం. “ఎర్రగుడి “సినిమా మంచి కథాంశంతో రూపొందుతోంది. మంచి విజయం సాధిస్తుంది. సంజీవ్ గారి డైరక్షన్లో నేను త్వరలో సినిమా తీయబోతున్నాను అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోరెంట శ్రావణి మాట్లాడుతూ.. మంచి కథ, చక్కని నటినటులు, సీనియర్ సాంకేతిక నిపుణులు సెట్ అయిన ఈ “ఎర్రగుడి” సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అన్నారు. ఈ రోజు నుంచి సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఆర్టిస్ట్ లు: హీరో- వెంకట్ కిరణ్, హీరోయిన్ శ్రీజిత ఘోష్, ఆదిత్య ఓం, రఘుబాబు, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, ఎస్తేర్, అజయ్ ఘోష్, ఢిల్లీ రాజేశ్వరి, వనిత రెడ్డి, రాజేష్ చీరాల, జ్యోతి, శ్రావణి, అయేషా, దేవిశ్రీ ప్రభు, రామ్ రమేష్, హరీష్ తదితరులు.
టెక్నిషియన్స్ లిస్ట్: సినిమాటోగ్రఫీ : ఎస్.ఎన్ .హరీష్ , సంగీతం : మాధవ్ సైబా, రామ్ సుధి, సంజీవ్, లిరిక్స్ : సాగర్ నారాయణ, రాజాపురం శ్రీనాథ్ రెడ్డి ఫైట్స్ : నటరాజ్, కొరియోగ్రఫీ: సూర్యకిరణ్, అనీష్, ఆర్ట్ : కె.వి. రమణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : బిజివేముల రాజశేఖర్ రెడ్డి, కో డైరెక్టర్ : సిరిమల్ల అక్షయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గోరెంట శ్రావణి, నిర్వహణ : ఘంటా శ్రీనివాస రావు, లైన్ ప్రొడ్యూసర్ : ఆర్.డి.ఎస్.., నిర్మాణం : అన్విక ఆర్ట్స్. రచన, దర్శకత్వం: సంజీవ్ మేగోటి.